Hearing Troubles: హెడ్ఫోన్లు, ఇయర్బడ్స్ తో వినికిడి సమస్యలు
Hearing Troubles: హెడ్ఫోన్లు, ఇయర్బడ్స్ వాడితే వినికిడి సమస్యలు వస్తాయని హెచ్చరిస్తున్నారు నిపుణులు.
Hearing Troubles: హెడ్ ఫోన్స్ లేదా ఇయర్ ఫోన్స్ వాడనివారు ఇప్పుడు ఈ జనరేషన్ లో లేరంటే నమ్మలేం. 90 శాతం మంది లైఫ్ లో ఇవి భాగమైపోయాయి. అవి పెట్టుకుని ఇప్పుడున్న ఇంటర్ నెట్ ప్రపంచంలో ఇష్టమైన మ్యూజిక్ వింటూ ఎంజాయ్ చేయడం యూత్ కి అలవాటైపోయింది. అసలు ఏ పని చేస్తున్నా.. ఇవి మాత్రం ఉండాల్సిందే.. లేదంటే చేసే పని కూడా స్లో అయిపోతుంది. మాంచి సౌండ్ పెట్టుకుంటేనే కిక్ వస్తుందని యూత్ పీలవుతోంది. కాని ఎక్కువ సౌండ్ పెట్టుకుంటే పిల్లలు, యూత్ వారి వినికిడి శక్తి పోగొట్టుకునే ప్రమాదముందనే హెచ్చరికలు వస్తున్నాయి. అవేంటో మన 'లైఫ్ స్టైల్' లో చూద్దాం.
వరల్డ్ పబ్లిక్ హెల్త్ రిపోర్ట్ ప్రకారం 70 డెసిబెల్స్కు మించి సౌండ్తో ఆడియో వినకూడదు. అలా చేస్తే భవిష్యత్తులో వినికిడి లోపం వచ్చే ప్రమాదం ఉంటుంది. కానీ చాలా మంది పిల్లలు, టీనేజీ యువత 85 డెసిబెల్స్తో ఆడియో వింటున్నారు. ఇది అత్యంత ప్రమాదకరమని అమెరికాకు చెందిన స్వచ్ఛంద సంస్థ ది క్వైట్ మెంబర్ డేనియల్ ఫింక్ చెబుతున్నారు. ఒక రోజులో గంటకు పైగా 85 డెసిబెల్స్ను మించి ఆడియో వినే పిల్లలు, టీనేజీ యువకుల్లో వినికిడి లోపం వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉందని ఆయన పేర్కొన్నారు. 85 డెసిబెల్స్ సురక్షితం అని ఇటీవల వాల్ స్ట్రీట్ జర్నల్ కథనాన్ని తప్పుబడుతూ, ఇది ఎవరికీ సురక్షితమైన ఎక్స్పోజర్ కాదని ఆయన స్పష్టం చేశారు.
నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఆక్యుపేషనల్ సేఫ్టీ అండ్ హెల్త్ 85 డిబిఎ సౌండ్ ఎక్స్పోజర్ లెవల్ను సిఫార్సు చేసినట్లు వాల్స్ట్రీట్ కథనం ఇటీవల పేర్కొంది. కానీ దీనికి భిన్నంగా డేనియల్ ఫింక్ వ్యాఖ్యలు చేశారు. 70 డెసిబెల్స్ కంటే ఎక్కువ సౌండ్ పిల్లలు, యువకులకు అంత సరక్షితం కాదని ఆయన చెబుతున్నారు. అయితే, ఫ్యాక్టరీలో శబ్ధాల మధ్య పనిచేసే కార్మికులు, లేదా భారీ పరికరాల ఆపరేటర్లకు 85 డెసిబెల్స్ సౌండ్ వరకు ఎటువంటి ప్రమాదం లేదని, ఈ ప్రమాదం చిన్నపిల్లల్లోనే ఎక్కువగా ఉంటుందని ఆయన చెప్పారు. ఏదేమైనా, పిల్లల చెవులు జీవితకాలం పనిచేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి, సాధ్యమైనంత వరకు హెడ్ఫోన్స్, ఇయర్బడ్స్ వాడకాన్ని తగ్గించాలని చెప్పారు. ఒకవేళ, ఉపయోగించినా సరే 70 డెసిబెల్స్ కంటే ఎక్కువ స్థాయిలో ఆడియో వినకూడదని ఆయన సిఫార్సు చేస్తున్నారు.