Eye Health: ఈ కారణాల వల్ల చిన్న వయసులోనే కళ్లద్దాలు.. నివారిస్తే కంటి చూపు మెరుగు..!
Eye Health: నేటి రోజుల్లో చిన్న వయసులోనే అందరికి కళ్లద్దాలు వస్తున్నాయి. ముఖ్యంగా పిల్లలు ఎక్కువ బాధితులుగా మారుతున్నారు.
Eye Health: నేటి రోజుల్లో చిన్న వయసులోనే అందరికి కళ్లద్దాలు వస్తున్నాయి. ముఖ్యంగా పిల్లలు ఎక్కువ బాధితులుగా మారుతున్నారు. కొంతమంది ఈ విషయాన్ని చాలా తేలికగా తీసుకుంటున్నప్పటికీ కంటి సమస్యలు ధీర్ఘకాలికంగా వేధిస్తాయి. మనం కళ్ళ సహాయంతో చూడటమే కాదు మెదడుకు సందేశాలని కూడా పంపుతాము. జీవనశైలి సరిగ్గా లేకపోవడం వల్ల చాలామంది కంటికి సంబంధించిన సమస్యలను ఎదుర్కొంటున్నారు. చిన్న వయస్సులోనే కళ్లద్దాలు ధరిస్తున్నారు. అయితే ఏ కారణాల వల్ల ఇలా జరుగుతుందో తెలుసుకుందాం.
కాంటాక్ట్ లెన్స్ వాడటం
కంటి సమస్యలు వచ్చినప్పుడు యువత కళ్లద్దాలు వాడకుండా కాంటాక్ట్ లెన్స్‌ని ఉపయోగిస్తున్నారు. వీటివల్ల కళ్ల మరింత దెబ్బతింటున్నాయి. కాంటాక్ట్ లెన్స్ అప్లై చేసేముందు చేతులని శుభ్రంగా కడగాలి. లేదంటే బాక్టిరియా ద్వారా కళ్లకి ఇన్ఫెక్షన్ వస్తుంది. కాంటాక్ట్ లెన్స్ కన్నా కళ్లద్దాలు బెటర్ అని చెప్పవచ్చు.
చదివేటప్పుడు దూరం
చదివేటప్పుడు కళ్ళకు, పుస్తకానికి మధ్య కనీసం 25 సెం.మీ. దూరం ఉండాలి. ఇంతకంటే తక్కువ ఉన్నా లేదా ఎక్కువ ఉన్నా అది కళ్ళపై చెడు ప్రభావాన్ని చూపుతుంది. అందుకే చదివేటప్పుడు కళ్ల మధ్య దూరం సరిగ్గా ఉండే విధంగా చూసుకోవాలి.
రెప్ప వేయకుండా ఉన్నప్పుడు
ఏదైనా పనిచేసేటప్పుడు తరచుగా కంటి రెప్పలు ఆడిస్తూ ఉండాలి. లేదంటే కళ్లు పొడిబారుతాయి. దీంతో కంటిచూపు బలహీనంగా మారుతుంది. ఈరోజుల్లో చాలామంది సెల్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, కంప్యూటర్లపై పనిచేస్తున్నారు. ఇలాంటి సమయంలో వారు తక్కువ సార్లు కంటి రెప్పలు ఆడిస్తారు. దీనివల్ల కళ్లు పొడిబారి కంటిచూపు మందగిస్తుంది. దీంతో కళ్లకి అద్దాలు వచ్చే అవకాశం ఉంటుంది.
మంచి డైట్
కంటి ఆరోగ్యం బాగుండాలంటే పోషకాలు ఉండే ఆహారం తీసుకోవాలి. ఆకుకూరలు, క్యారెట్, బీట్‌రూట్, మంసం, గుడ్లు డైట్‌లో ఉండే విధంగా చూసుకోవాలి. తరచుగా ఐ టెస్ట్ చేయించుకోవాలి. ఇన్‌ఫెక్షన్ ఉంటే డాక్టర్‌ని సంప్రదించి సరైన చికిత్స తీసుకోవాలి.