Health Tips: వేడినీటిని ఈ విధంగా తాగుతున్నారా.. ఈ అవయవాలకి చాలా ప్రమాదం..!

Health Tips: చలికాలంలో వేడి నీటిని తాగడం వల్ల గొంతు,ముక్కు, ఛాతీకి ఉపశమనం లభిస్తుంది.

Update: 2023-01-21 11:30 GMT

Health Tips: వేడినీటిని ఈ విధంగా తాగుతున్నారా.. ఈ అవయవాలకి చాలా ప్రమాదం..!

Health Tips: చలికాలంలో వేడి నీటిని తాగడం వల్ల గొంతు,ముక్కు, ఛాతీకి ఉపశమనం లభిస్తుంది. అయితే అధిక వేడి నీటి వినియోగం ఆరోగ్యానికి హానికరం. మితిమీరిన వేడినీరు ఆరోగ్యానికి విషం వంటిది. ఇది మన శరీరంలోని అంతర్గత అవయవాలకు హాని కలిగిస్తుంది. వేడినీరు ఏ విధంగా తాగాలి.. దీని వల్ల కలిగే నష్టాల గురించి ఈ రోజు తెలుసుకుందాం.

చర్మ కణజాలం దెబ్బతింటుంది

మనం ఎక్కువగా వేడి నీటిని తీసుకుంటే అది చర్మ కణజాలానికి హాని కలిగిస్తుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం చర్మం అంతర్గత అవయవాలు బర్న్ అవుతాయి. నీటిని వేడి చేసినప్పుడు అందులో ఉండే లోహ కణాలు త్వరగా కరిగిపోతాయి. అందుకే ఎప్పుడైనా సరే నీటిని స్టీల్‌పాత్రలో వేడిచేసి తీసుకోవాలి.

నీటిని వేడి చేసేటప్పుడు త్రాగేటప్పుడు కొన్ని విషయాలు కచ్చితంగా గుర్తుంచుకోవాలి.

మరిగే వేడినీటిని ఎప్పుడు తాగవద్దు. ఎందుకంటే నాలుక లేదా నోరు మండుతుంది. వేడినీళ్లలో చల్లటి నీళ్లు కలిపి తాగడం కూడా ఆరోగ్యానికి మంచిది కాదు. అందుకే నేరుగా తాగేందుకు అనువుగా ఉండేలా నీటిని వేడి చేయాలి. మీరు నీటిని ఎక్కువగా వేడి చేసినట్లయితే అవి గోరువెచ్చగా మారే వరకు వేచి చూడాలి. దీనికి కొంత సమయం పట్టవచ్చు.

అంతర్గత అవయవాలకి నష్టం

ఎక్కువగా వేడిచేసిన నీటిని తాగడం వల్ల శరీరంలోని లివర్‌, కిడ్నీలకు ప్రమాదం ఉంటుంది. అధిక వేడి నీటిని కిడ్నీలు వడబోయలేవు. అంతేకాకుండా లివర్‌లోని కణాలు గట్టిపడే అవకాశాలు ఉన్నాయి. అందుకే గోరువెచ్చని నీటిని మాత్రమే తాగాలి. ఉదయం పూట తాగినప్పుడు మంచి ఫలితాలు ఉంటాయని గుర్తుంచుకోండి.

Tags:    

Similar News