Water: నీళ్లతో నిజంగా ఇన్ని లాభాలున్నాయా.? మీ ఊహకు కూడా అందవు..
నీళ్లు తాగడం వల్ల బరువు కూడా తగ్గొచ్చని నిపుణులు చెబుతున్నారు. తాజాగా నిర్వహించిన ఓ సర్వేలో ఈ విషయాలు వెల్లడయ్యాయి.
మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే ఆహారం ఎంత ముఖ్యమో.. నీరూ అంతే ముఖ్యమని తెలిసిందే. ఎన్నో వ్యాధులకు నీరు ఒక పరిష్కారమని వైద్యులు సైతం చెబుతుంటారు. అందుకే కచ్చితంగా తగినంత నీరు తీసుకోవాలని చెబుతుంటారు. నీరు ఎక్కువగా తీసుకుంటే డీహైడ్రేషన్ మొదలు, కిడ్నీ సంబంధిత వ్యాధుల వరకు ఎన్నో వ్యాధులకు మంచి నీటితో ఫుల్‌స్టాప్ పెట్టొచ్చు.
నీళ్లు తాగడం వల్ల బరువు కూడా తగ్గొచ్చని నిపుణులు చెబుతున్నారు. తాజాగా నిర్వహించిన ఓ సర్వేలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. సర్వేలో పాల్గొన్న వారి ఆహార అలవాట్లను విశ్లేషించిన తర్వాత ఈ విషయాలను వెల్లడించారు. రోజుకు సరిపడ నీరు తీసుకున్న వారు.. కేలరీలతోపాటు.. కూల్ డ్రింక్స్, కొవ్వు పదార్థాలు, చక్కెర, ఉప్పు తక్కువగా ఉన్న ఆహారాన్ని తీసుకున్నట్లు అధ్యయనంలో తేలింది. ఇది సహజంగానే పరోక్షంగా బరువు పెరగడాన్ని కంట్రోల్ చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. రోజుకు 1-3 కప్పులు ఎక్కువగా నీళ్లు తాగినా 68 నుంచి 205 వరకు కేలరీలు తగ్గుతున్నట్టు బయట పడింది.
కాబట్టి బరువు తగ్గాలనుకునే వారు తగినన్ని నీళ్లు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. దాహం వేసిన సమయంలో కూల్ డ్రింక్స్‌కు బదులుగా నీరు తీసుకోవడమే బెటర్ అని నిపుణులు చెబుతున్నారు. నిజానికి దాహం వేయడానికి ముందుగానే నీటిని తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు ఒంట్లో నీటి శాతం తగ్గిపోయిన చాలా సమయం తర్వాతే దాహం వేస్తుంది. అందుకే తరచూగా వాటర్ తీసుకోవాలని సూచిస్తున్నారు. కానీ చాలా మంది దాహం వేసే వరకు నీటిని తీసుకోరు. అయితే ఇది మంచి అలవాటు కాదని అంటున్నారు.
సరిపడ నీటిని తీసుకోవడం వల్ల జీర్ణ సంబంధిత సమస్యలు దూరమై, మలబద్ధకం సమస్య దరిచేరకుండా చేస్తుంది. రక్తపోటును, గుండె వేగాన్ని నియంత్రించడంలో నీరు కీలకపాత్ర పోషిస్తుంది. శరీరంలో నీటి శాతం తగ్గితే బలహీనత, రక్తపోటు, తలనొప్పి వంటి సమస్యలు వస్తాయి. రోజుకు కనీసం 2 లీటర్ల నీరు తాగేలా చూసుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో మూత్రం ముదురు రంగులోకి మారకుండా చూసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.