Hot Water Side Effects: వేడినీరు తాగడం మంచిదే.. కానీ అవసరానికి మించి తాగితే అనర్థాలు..!
Hot Water Side Effects: ఉదయం నిద్రలేచిన వెంటనే ఒక గ్లాసు వేడినీరు తాగడం ఆరోగ్యానికి చాలా మంచిది. దీనివల్ల శరీరానికి చాలా ప్రయోజనాలు కలుగుతాయి.
Hot Water Side Effects: ఉదయం నిద్రలేచిన వెంటనే ఒక గ్లాసు వేడినీరు తాగడం ఆరోగ్యానికి చాలా మంచిది. దీనివల్ల శరీరానికి చాలా ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా చలికాలంలో ఇలాచేస్తే చాలా మంచి ఫలితాలు ఉంటాయి. కానీ ఏదైనా మితంగా చేస్తేనే మంచిది అలాగే వేడినీరు కూడా తక్కువ తాగితేనే ఆరోగ్యానికి మంచిది. ఎక్కువగా తాగితే చాలా అనర్థాలు జరుగుతాయి. రోజులో చాలాసార్లు వేడినీరు తాగేవారి పరిస్థితి ఎలా ఉంటుందో ఈ రోజు తెలుసుకుందాం.
పరిమితికి మించి వేడి నీటిని తాగితే జీర్ణవ్యవస్థకు హాని జరుగుతుంది. ఇది ఆహార నాళాన్ని దెబ్బతీస్తుంది. ఎందుకంటే దాని పొర చాలా సున్నితంగా ఉంటుంది. అజీర్ణం, అసిడిటీ వంటి సమస్యలు తలెత్తుతాయి. వేడి నీటిని ఎక్కువగా తాగడం వల్ల నోటిపూత సమస్య వస్తుంది. ఇది సున్నితమైన పెదాలకు హాని కలిగించడమే కాకుండా గొంతు లోపలి చర్మాన్ని దెబ్బతీస్తుంది. చాలా వేడి నీటిని తాగడం వల్ల గొంతులోని సున్నితమైన పొరలు కాలిపోతాయి. దీంతో గొంతు తరచుగా పొడిబారినట్లు అనిపిస్తుంది.
వేడి నీరు శరీర దాహాన్ని తీర్చలేదు. కాబట్టి నిరంతరం వేడి నీటిని తాగుతూ ఉంటే డీహైడ్రేషన్ సమస్య ఎదురవుతుంది. మీరు రోజులో చాలా వేడి నీటిని తాగేవారు అయితే మధ్యమధ్యలో చల్లని లేదా సాధారణ నీటిని తాగుతూ ఉండాలి. మితిమీరిన వేడి నీటిని తాగడం వల్ల కిడ్నీలపై చెడు ప్రభావం పడుతుంది. మూత్రపిండాలు శరీరం నుంచి విషాన్ని ఫిల్టర్ చేయలేవు. ఇలా ఎక్కువ రోజులు జరిగితే మూత్రపిండాలు ఫెయిల్ అవుతాయి. మితిమీరిన వేడి నీటిని తాగడం నిద్రను ప్రభావితం చేస్తుంది. వేడినీళ్లు ఎక్కువగా తాగేవాళ్లు నిద్రలేమితో బాధపడాల్సి వస్తుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.