Porridge Water: గంజిని వృథాగా వదిలేయొద్దు.. ఇవి తెలిస్తే అస్సలు వదలరు..!

Porridge Water: పూర్వకాలంలో అన్నం పరబ్రహ్మ స్వరూపంగా గంజిని ఔషధంగా భావించేవారు. ఒకప్పుడు అన్నం కాకుండా గంజి మాత్రమే చేసుకొని తాగేవారు.

Update: 2024-04-10 04:00 GMT

Porridge Water: గంజిని వృథాగా వదిలేయొద్దు.. ఇవి తెలిస్తే అస్సలు వదలరు..!

Porridge Water: పూర్వకాలంలో అన్నం పరబ్రహ్మ స్వరూపంగా గంజిని ఔషధంగా భావించేవారు. ఒకప్పుడు అన్నం కాకుండా గంజి మాత్రమే చేసుకొని తాగేవారు. కొన్ని రోజులకు అన్నం వండుకొని అందులోని గంజిని వంపుకొని దానిలో ఉల్లిపాయం, నిమ్మరసం కలుపుకొని తాగేవారు. నిజానికి అన్నంలో కంటే గంజిలోనే పోషకాలు అధికంగా ఉంటాయి. ఎందుకంటే బియ్యం ఉడకడం వల్ల అందులో ఉండే పోషకాలు మొత్తం గంజిలోకి వస్తాయి. అందుకే పూర్వకాలంలో దీనినే నిజమైన, బలవర్ధక మైన ఆహారంగా భావించేవారు. అంతేకాదు ఇది సులభంగా జీర్ణమవుతుంది. శరీరానికి కావాల్సిన పోషకాలను అందిస్తుంది. ఈ రోజు గంజి తాగడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి తెలుసుకుందాం.

గంజి నీరు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. వేసవిలో డీహైడ్రేషన్‌ను నివారించడంలో సాయపడుతుంది. గంజిలో స్టార్చ్ ఉంటుంది. ఇది జీర్ణ సమస్యల నుంచి బయటపడటానికి సాయపడుతుంది. మీరు విరేచనాలు, కడుపు నొప్పి లేదా మలబద్ధకం అనుభవిస్తే కొంచెం గంజి నీరు తాగడం వల్ల తగ్గిపోతాయి. గంజి నీరు అధిక బరువును తగ్గిస్తుంది. రోగ నిరోధక శక్తిని పెంచడానికి గంజి నీళ్లు తాగవచ్చు. గంజి నీళ్లలో చాలా అమినో యాసిడ్స్ ఉంటాయి. ఇది శరీరంలోని కండరాల ఆరోగ్యానికి మేలు చేస్తుంది. విటమిన్లు, ఇతర యాంటీఆక్సిడెంట్లను కలిగి ఉన్న గంజి నీరు చర్మ ఆరోగ్యానికి చాలా మంచిది. గంజి నీళ్లతో మీ ముఖాన్ని కడుక్కోవడం వల్ల మూసుకుపోయిన రంధ్రాలు తెరుచుకోవడంతోపాటు మొటిమలు రాకుండా ఉంటాయి. ముఖంపై ఉన్న నల్ల మచ్చలను పోగొట్టి, చర్మం కాంతివంతంగా, మృదువుగా మారుతుంది.

ఇంట్లో మజ్జిగ అందుబాటులో లేకపోతే గంజిని అన్నంలో కలుపుకుని తాగండి. కడుపు నిండుగా ఉండటమే కాకుండా శరీరాన్ని కూల్‌గా ఉంచుతుంది. గంజి తాగడం వల్ల జ్వరం తగ్గుముఖం పట్టేందుకు సహకరిస్తుంది. గంజి చర్మాన్ని యవ్వనంగా ఉంచుతుంది. చర్మ వ్యాధులను తగ్గిస్తుంది. గంజి శరీరాన్ని, మనసును ప్రశాంతంగా ఉంచుతుంది. గంజి శరీర ఉష్ణోగ్రతను నియంత్రిస్తుంది. అదేవిధంగా గంజి నీరు జుట్టు రాలడాన్ని నివారించడంలో సాయపడుతుంది. జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. గంజిలోని కార్బోహైడ్రేట్లు శరీరానికి మంచి శక్తినిస్తాయి. నీరసంగా ఉన్నప్పుడు కాస్త గంజి తాగితే ఉత్సాహం వస్తుంది. ఇన్ని పనులు చేసే గంజిని వదిలిపెట్టి కేవలం కార్బోహైడ్రేట్స్​ఉండే అన్నం తినడం వల్ల ఈ కాలంలో పొట్టలు వస్తున్నాయి. ఇప్పటికై నా గంజి ప్రయోజనాన్ని తెలుసుకొని వాడితే మంచి ఫలితాలు ఉంటాయి.

Tags:    

Similar News