Blindness: రేచీకటికి కారణం ఈ లోపమే.. జాగ్రత్తగా ఉండకపోతే అంతే సంగతులు..!

Blindness: మన శరీరంలోని ప్రతి అవయవానికి ప్రాముఖ్యత ఉంది. అలాగే కంటి చూపు ఆరోగ్యంగా ఉండాలంటే విటమిన్ ఎ ఉండే ఆహారం తీసుకోవాలి.

Update: 2022-09-05 10:30 GMT

Blindness: రేచీకటికి కారణం ఈ లోపమే.. జాగ్రత్తగా ఉండకపోతే అంతే సంగతులు..!

Blindness: మన శరీరంలోని ప్రతి అవయవానికి ప్రాముఖ్యత ఉంది. అలాగే కంటి చూపు ఆరోగ్యంగా ఉండాలంటే విటమిన్ ఎ ఉండే ఆహారం తీసుకోవాలి. సాధారణంగా ఎరుపు, పసుపు, ఆకుపచ్చ పండ్లు, కూరగాయలు డైట్‌లో ఉండాలి. విటమిన్ డి లాగా సూర్యకాంతి ద్వారా విటమిన్ ఎ పొందలేము. ఆహారం నుంచి మాత్రమే ఈ పోషకాలను పొందాలి. విటమిన్ ఎ లోపాన్ని నివారించడానికి ప్రతిరోజూ సగటున 700 నుంచి 900 మైక్రోగ్రాముల (mcg) విటమిన్ A అవసరం.

విటమిన్ ఎ కళ్లకు ముఖ్యమైనది

విటమిన్ ఎ మీ కళ్ళకు చాలా ముఖ్యమైనది. ఈ పోషకాన్ని 'రెటినాల్' అని పిలుస్తారు. ఇది 'రెటీనా'అనే పదం నుంచి ఉద్భవించింది. ఈ విటమిన్ మన కంటి రెటీనాను ఆరోగ్యంగా ఉంచుతుంది. శరీరంలో విటమిన్ ఎ లేని వ్యక్తులు రేచీకటికి గురవుతారు. మన రోజువారీ అవసరాలకు అనుగుణంగా విటమిన్ ఎ తీసుకోవాలి. విటమిన్‌ ఎ ఆహారాలని కచ్చితంగా తినాలి. మొక్క, జంతు ఆధారిత ఆహారాల గురించి తెలుసుకుందాం.

విటమిన్‌ ఎ ఉండే కూరగాయలు, పండ్లు

1. ఆరెంజ్, కూరగాయలు

2. బలవర్థకమైన తృణధాన్యాలు

3. ఆకుపచ్చ ఆకు కూరలు

4. కాడ్ లివర్ ఆయిల్

5. గుడ్లు, పాలు, క్యారెట్

6. బచ్చలికూర, చిలగడదుంప, బొప్పాయి

7. పెరుగు, సోయాబీన్

Tags:    

Similar News