Health Tips: మానసిక ఒత్తిడిని తేలికగా తీసుకోవద్దు.. సులువుగా ఇలా నియంత్రించండి..!
* మీరు ఈ సమస్యను నివారించాలంటే జీవనశైలిలో కొన్ని మార్పులు చేసుకోవాలి.
Health Tips: ఈ రోజుల్లో మానసిక ఒత్తిడి కారణంగా చాలామందిలో రక్తపోటు పెరుగుతోంది. అధిక సంఖ్యలో డిప్రెషన్‌లోకి వెళుతున్నారు. ఇది వారి మొత్తం కుటుంబాన్ని ప్రభావితం చేస్తుంది. మానసిక ఒత్తిడి గురించి సమాజంలో సరైన అవగాహన లేదు. మీరు ఈ సమస్యను నివారించాలంటే జీవనశైలిలో కొన్ని మార్పులు చేసుకోవాలి. ఒత్తిడి నుండి ఉపశమనం పొందడానికి కొన్ని చిట్కాలను అనుసరించాలి. వాటి గురించి వివరంగా తెలుసుకుందాం.
మెట్లు ఎక్కండి
ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం మీకు చిరాకు, కోపం లేదా టెన్షన్ ఏర్పడినప్పుడు 3-4 సార్లు దీర్ఘ శ్వాస తీసుకోండి. తరువాత మెట్లు ఎక్కి 2-3 సార్లు దిగండి. ఒకవేళ మెట్లు ఎక్కలేకపోతే కొద్దిసేపు నడవవచ్చు. ఇలా చేయడం వల్ల చిరాకు పోయి మనసు ప్రశాంతంగా మారుతుంది.
తగినంత నిద్ర
మంచి ఫిట్‌నెస్ కోసం ప్రతిరోజూ 7-8 గంటల నిద్ర అవసరం. దీని కంటే తక్కువ నిద్రపోతే శరీరం రోజంతా అలసిపోతుంది. ఇది మనస్సు, కళ్ళను ప్రభావితం చేస్తుంది. దీని కారణంగా మానసిక ఒత్తిడిని ఎదుర్కోవలసి ఉంటుంది.
తక్కువ ఉప్పు
కోపం ఎక్కువగా వచ్చే వారు ఉప్పు పదార్థాలు తీసుకోవడం తగ్గించాలి. ఉప్పు ఎక్కువగా తీసుకోవడం వల్ల బ్లడ్ ప్రెషర్ పెరుగుతుంది. తద్వారా చిరాకు, కోపం (మెంటల్ స్ట్రెస్) వస్తుంది. దీని కారణంగా గుండెపోటు ప్రమాదం పెరుగుతుంది. కాబట్టి వీలైనంత వరకు ఉప్పు తీసుకోవడం తగ్గించాలి.
కుటుంబంతో కలివిడి
మానసిక ఒత్తిడి నుంచి బయటపడాలంటే కొద్దిరోజులు కుటుంబంతో కలిసి బయటకు వెళ్లాలి. ఇలా చేయడం వల్ల శరీరం, మనస్సు రెండూ రిలాక్స్ అవుతాయి. ఒత్తిడి స్థాయి తగ్గుతుంది. పని చేయడానికి కొత్త శక్తి లభిస్తుంది.
సోషల్ నెట్‌వర్కింగ్
ఒంటరి జీవితాన్ని గడపడానికి ఇష్టపడే వ్యక్తులు మానసిక ఒత్తిడికి గురవుతారు. ఇలాంటి వారు ఇతరులతో తొందరగా కలవలేరు. అందుకే సోషల్ నెట్‌వర్కింగ్‌ను పెంచుకోవాలి. స్నేహితులు, పరిచయస్తులను కలవడం వల్ల ఒంటరితనం, ఒత్తిడి రెండూ దూరమవుతాయి.