Eye Sight: ముప్పై ఏళ్లకే చూపు మందగిస్తుందా.. వీటిని మార్చుకోపోతే చాలా నష్టం..!
Eye Sight: ముప్పై ఏళ్లకే చూపు మందగిస్తుందా.. వీటిని మార్చుకోపోతే చాలా నష్టం..!
Eye Sight: ఈ రోజుల్లో ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్‌ఫోన్‌లు, కంప్యూటర్‌ల వాడకం విపరీతంగా పెరిగింది. ఈ ఎలక్ట్రానిక్ వస్తువులు ఖచ్చితంగా మన పనిని సులభతరం చేశాయి. కానీ వీటివల్ల ఆరోగ్యంపై చెడు ప్రభావం కనిపిస్తోంది. ముఖ్యంగా ఈ పరికరాలు కళ్లని బాగా దెబ్బతీస్తున్నాయి. చాలా మందికి నిద్రపోయే ముందు స్మార్ట్‌ఫోన్‌ను ఉపయోగించే అలవాటు ఉంటుంది. కొంతమంది చీకటి గదుల్లో స్మార్ట్‌ఫోన్‌లు వాడుతుంటారు. ఇలాంటి అలవాట్ల వల్ల కళ్లకు చాలా ప్రమాదమని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
స్మార్ట్ ఫోన్ల వల్ల సమస్య
స్మార్ట్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు ఎక్కువగా వాడటం వల్ల కళ్లు పొడిబారి నొప్పి మొదలవుతుంది. ఇది కాకుండా వాపు సంభవిస్తుంది. రోజంతా ఆన్‌లైన్‌లో పనిచేసే వారు కళ్లలో దురద, మంటతో బాధపడుతున్నారు. దీని కారణంగా లాక్రిమల్ గ్రంథికి ప్రమాదం ఏర్పడింది. ఎక్కువ స్మార్ట్‌ఫోన్‌లను ఉపయోగించే వారు బ్లింక్ చేయడానికి ఎక్కువ సమయం పడుతుంది.
ఆరోగ్య నిపుణుల సూచనలు
ఈ సమస్యల నుంచి బయటపడాలంటే ల్యాప్‌టాప్, స్క్రీన్‌పై తక్కువ సమయం గడపాలి. ఇది కాకుండా కళ్లు ఆరోగ్యంగా ఉండాలంటే 20-20 నియమాన్ని పాటించాలి. ఇందులో 20 నిమిషాలు స్క్రీన్‌పై పనిచేసిన తర్వాత 20 నిమిషాలు వేరే చోట ధ్యానం చేయాలి. స్మార్ట్‌ఫోన్‌ను చీకటి గదిలో ఎప్పుడూ ఉపయోగించకూడదు. స్క్రీన్‌ని ఉపయోగించే ముందు బ్లూ కట్ లెన్స్‌లు ఉన్న అద్దాలను ఉపయోగించాలి.