Epilepsy Problem: మూర్ఛ అనేది ఒక తరం నుంచి మరొక తరానికి వ్యాపిస్తుందా..!
Epilepsy Problem: గ్రామీణ ప్రాంతాల్లో మూర్ఛ వ్యాధి విషయంలో ఇప్పటికీ అవగాహన కొరవడింది. ఈ సమస్యతో బాధపడుతున్నవారు ఎంత ఇబ్బందిపడుతున్నప్పటికీ నాటువైద్యా న్ని ఆశ్రయిస్తారు కానీ మంచి హాస్పిటల్‌కు తీసుకెళ్లరు.
Epilepsy Problem: గ్రామీణ ప్రాంతాల్లో మూర్ఛ వ్యాధి విషయంలో ఇప్పటికీ అవగాహన కొరవడింది. ఈ సమస్యతో బాధపడుతున్నవారు ఎంత ఇబ్బందిపడుతున్నప్పటికీ నాటువైద్యా న్ని ఆశ్రయిస్తారు కానీ మంచి హాస్పిటల్‌కు తీసుకెళ్లరు. మూర్ఛ అనేది మెదడు సంబంధించిన ఒక వ్యాధి. మెదడు పనితీరులో ఆటంకం కారణంగా ఈ సమస్య వస్తుందని వైద్యులు చెబుతు న్నారు. చాలా సందర్భాలలో మూర్ఛ సమస్య జన్యుపరమైన కారణాల వల్ల సంభవిస్తుంది. అంటే ఈ వ్యాధి ఒక తరం నుంచి మరొక తరానికి సంక్రమిస్తుంది కానీ చాలా మందికి దీని గురించి తెలియదు.
కొన్నిసార్లు మూర్ఛ పేషెంట్లను హాస్పిటల్‌కు తీసుకెళ్లినా ట్రీట్‌మెంట్ చివరివరకు కొనసాగించ రు. చికిత్స మధ్యలోనే వదిలేస్తారు. దీని కారణంగా వ్యాధి మరింత తీవ్రమవుతుంది. కానీ సమయానికి చికిత్స అందిస్తే 80 నుంచి 90 శాతం మూర్ఛ రోగులలో ఈ వ్యాధి కంట్రోల్ అవుతుం ది. ఒక వ్యక్తి ఆకస్మిక మూర్ఛ అనుభవిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాలని గుర్తుంచుకోండి.
మూర్ఛ జన్యుపరమైన సమస్య
జన్యుపరమైన కారణాల వల్ల మూర్ఛ వస్తుందని డాక్టర్లు చెబుతున్నారు. దాదాపు 70% మూర్ఛ కేసులు జన్యుపరమైన కారణాలతో సంబంధం కలిగి ఉంటాయి. ఇటీవల ప్రచురించిన పరిశోధన ప్రకారం శరీరంలో ఉన్న 977 జన్యువులు మూర్ఛకు సంబంధించినవి. ఈ జన్యువులను ఫినోటైప్ ఆధారంగా 4 వర్గాలుగా విభజించారు. మూర్ఛ జన్యువులుగా పరిగణించబడే 84 జన్యువులు ఎపిలెప్సీ సిండ్రోమ్‌కు కారణమవుతాయి. తల్లిదండ్రులకు మూర్ఛ సమస్య ఉంటే అది పిల్లలలో కూడా సంభవించే ప్రమాదం ఉంది. ఈ వ్యాధితో బాధపడుతున్న తల్లిదండ్రులు తమ పిల్లల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి.