Health Tips: రెడ్‌ వైన్ తాగితే గ్లామరస్‌గా ఉంటారా.. ఈ విషయాలు తెలుసుకోండి

Health Tips: ఇటీవల ఎక్కువగా వినిపిస్తున్న మాట ఏంటంటే రెడ్‌ వైన్‌ తాగడం వల్ల గ్లామరస్‌గా కనిపిస్తారని. దీనివల్ల రెడ్‌ వైన్‌ తాగేవారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతుంది.

Update: 2024-01-12 16:00 GMT

Health Tips: రెడ్‌ వైన్ తాగితే గ్లామరస్‌గా ఉంటారా.. ఈ విషయాలు తెలుసుకోండి

Health Tips: ఇటీవల ఎక్కువగా వినిపిస్తున్న మాట ఏంటంటే రెడ్‌ వైన్‌ తాగడం వల్ల గ్లామరస్‌గా కనిపిస్తారని. దీనివల్ల రెడ్‌ వైన్‌ తాగేవారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతుంది. నిజానికి రెడ్‌ వైన్‌లో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ సెప్టిక్ గుణాలు ఉంటాయి. ఇవి మొటిమల సమస్యను దూరం చేస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇది కాకుండా బ్యాక్టీరియాను తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. రెడ్‌వైన్‌ ముఖంలోని ముడతలు, ఫైన్ లైన్లను తొలగించడంలో సహాయపడుతుందని మరి కొందరు అంటున్నారు. వైన్‌తో పోలిస్తే ఇందులో ఆల్కహాల్ తక్కువగా ఉంటుంది. రెడ్ వైన్ నిజంగా చర్మానికి మేలు చేస్తుందా లేదా అనే విషయంపై చర్చిద్దాం.

నిపుణులు ఏమంటున్నారు..

డెర్మటాలజిస్టులు రెడ్‌ వైన్‌లో యాంటీ ఆక్సిడెంట్ ఉంటుందని, ఇది చర్మానికి ఎంతో మేలు చేస్తుందని చెబుతున్నారు. ఈ యాంటీఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్, ఆక్సీకరణ ఒత్తిడిని తొలగిస్తాయి. చర్మంలో కొల్లాజెన్‌ను ఉత్పత్తిచేస్తాయి. ఇది చర్మం వృద్ధాప్య లక్షణాలను నివారిస్తుంది.

ఈ విషయం గుర్తుంచుకోండి

అయితే ఏదైనా అధిక పరిమాణం మంచిది కాదు. రెడ్ వైన్ నిస్సందేహంగా చర్మానికి మేలు చేస్తుంది కానీ అధికంగా తాగడం వల్ల చర్మం దెబ్బతింటుంది. అధిక మొత్తంలో ఆల్కహాల్ డీహైడ్రేషన్ వాపునకు కారణమవుతుంది.

ఇలా ఉపయోగించండి

రెడ్ వైన్ తాగడంతో దానితో ముఖం కడుక్కోవచ్చు. మీరు పదేపదే మొటిమల సమస్యను ఎదుర్కొంటున్నట్లయితే రెడ్ వైన్‌లో కాటన్ బాల్‌ను ముంచి మొటిమల ప్రదేశంలో రాయాలి. రెడ్ వైన్‌ను చర్మంపై 15 నుంచి 20 నిమిషాలు అలాగే ఉంచి ఆపై కడగాలి. అయితే ఇలాంటి చర్యలు తీసుకునేటప్పుడు కచ్చితంగా డాక్టర్‌ సలహా పాటించాలని గుర్తుంచుకోండి. లేదంటే ప్రయోజనానికి బదులు నష్టం జరుగుతుంది.

Tags:    

Similar News