Health Tips: వంటనూనె మధుమేహం ప్రమాదాన్ని పెంచుతుందా..!

Health Tips: వంట నూనెలు అనేవి అన్నీ ఒకేలా ఉండవు. కొన్ని జంతు మూలాల నుంచి వస్తాయి.

Update: 2022-12-29 09:24 GMT

Health Tips: వంటనూనె మధుమేహం ప్రమాదాన్ని పెంచుతుందా..!

Health Tips: వంట నూనెలు అనేవి అన్నీ ఒకేలా ఉండవు. కొన్ని జంతు మూలాల నుంచి వస్తాయి. మరికొన్ని ఆలివ్, పొద్దుతిరుగుడు లేదా నువ్వుల నూనె ఇవి శరీరానికి చాలా మంచివి. నూనె గురించిన ప్రధాన ఆందోళన ఏంటంటే అందులో ఉండే సంతృప్త, ట్రాన్స్ ఫ్యాట్‌ల సంఖ్య. ఇవి శరీరంలో సమస్యలని కలిగిస్తాయి. మధుమేహంతో సహా జీవనశైలి వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతాయి. కొన్ని నూనెలలో ఒమేగా-3, మోనోశాచురేటెడ్ కొవ్వు ఆమ్లాలు కనిపిస్తాయి. ఇవి గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి. అందువల్ల ఆయిల్ ఫ్రీ డైట్ అస్సలు సిఫారసు చేయలేదు. కానీ వంట నూనెను తెలివిగా ఎంచుకోవడం ముఖ్యం.

వంటనూనె వల్ల మధుమేహం వస్తుందా?

వంట నూనె వల్ల మధుమేహం వస్తుందనేది అపోహ. కానీ ఆరోగ్యకరమైన ఆయిల్ డైట్‌ కొనసాగించకుండా, వ్యాయామం చేయకపోతే మధుమేహం బారిన పడే అవకాశాలు ఉన్నాయి. అందువల్ల వివిధ రకాల వంట నూనెల గురించి అవగాహన ఉండటం అవసరం. ప్రజలు తమకు నచ్చిన ఆహారం ద్వారా మధుమేహ బాధితులుగా మారుతున్నారు. ఇటీవల కాలంలో జంక్ ఫుడ్ , చిప్స్ , ఫ్రైస్ ఎక్కువగా తీసుకోవడం వల్ల మధుమేహం పెరుగుతోంది.

వేయించిన ఆహారాన్ని తీసుకోవడం వల్ల మధుమేహం 70 శాతం చొప్పున పెరుగుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. అందుకే మధుమేహం రాకుండా ఉండాలంటే డైట్‌ ప్లాన్‌ని చెక్ చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. మధుమేహం అనారోగ్యకరమైన వంట నూనెల వినియోగం వల్ల వస్తుంది. అయితే మధుమేహానికి ప్రధాన కారణం అనారోగ్యకరమైన జీవనశైలని గుర్తుంచుకోండి. సంతృప్త, ట్రాన్స్ ఫ్యాట్ తీసుకోవడం, ప్రాసెస్ చేసిన కార్బోహైడ్రేట్లు, ఎరుపు మాంసాలకి దూరంగా ఉండటం ఉత్తమం.

Tags:    

Similar News