Tomatoes Store Fridge: టమోటాలు ఫ్రిజ్‌లో స్టోర్‌ చేస్తున్నారా.. పొరపాటు చేస్తున్నారు జాగ్రత్త..!

Tomatoes Store Fridge: ప్రతి ఒక్కరి కిచెన్‌లో ఏ కూరగాయ ఉన్నా లేకున్నా టమోట మాత్రం కచ్చితంగా ఉంటుంది.

Update: 2024-03-24 13:30 GMT

Tomatoes Store Fridge: టమోటాలు ఫ్రిజ్‌లో స్టోర్‌ చేస్తున్నారా.. పొరపాటు చేస్తున్నారు జాగ్రత్త..!

Tomatoes Store Fridge: ప్రతి ఒక్కరి కిచెన్‌లో ఏ కూరగాయ ఉన్నా లేకున్నా టమోట మాత్రం కచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే దీనిని అన్ని కూరలలో వాడుతారు. అందుకే టమోటాను కూరగాయలలో ఆల్‌రౌండ్‌ర్‌ అని పిలుస్తారు. అయితే చాలామంది మార్కెట్‌కు వెళ్లినప్పుడు కిలోల కొద్దీ టమోటాలను తీసుకొచ్చి ఫ్రిజ్‌లో స్టోర్‌ చేస్తారు. ఇది మంచి పద్దతి కాదు దీనివల్ల మీ ఆరోగ్యాన్ని మీరే చెడగొట్టుకున్నవారు అవుతారు. టమోటాలను ఫ్రిజ్‌లో స్టోర్‌ చేయకూడదు. ఎందుకో ఈ రోజు తెలుసుకుందాం.

టమోటాలను ఫ్రిజ్‌లో పెడితే వాటి సహజసిద్ధమైన రుచిని కోల్పోతాయి. 39 డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రత వద్ద టమాటాలను ఉంచినప్పుడు వాటి రుచి, వాసనను కోల్పోతాయని పలు పరిశోధన ల్లో తేలింది. ఒకటి రెండు రోజులు అంటే పర్వాలేదు కానీ అంతకంటే ఎక్కువ రోజులు మాత్రం ఫ్రిజ్‌లోపెట్టకూడదు. దీనివల్ల డీఎన్‌ఏ మిథైల్‌ సంశ్లేషణలో మార్పులు సంభవిస్తాయి. దీనివల్ల రోగాల బారిన పడే ప్రమాదం ఉంటుంది. ఎక్కువ రోజులు టమాటాలను పెట్టడం వల్ల వాటి లోపల ఉండే జెల్లీ విరిగిపోతుంది. లోపల అంతా జ్యూసీగా మారుతుంది. దీన్ని తీసుకోవడం అంత మంచిది కాదు.

టమోటాలు పండినప్పుడు ఇథలీన్‌ను విడుదల చేస్తాయి. ఫ్రిజ్‌లో పెట్టడం వల్ల చల్లదనం కారణంగా ఇథలీన్‌ ఉత్పత్తి నిలిచిపోతుంది. దీనివల్ల టమోటాలు రుచిని కోల్పోయి పుల్లగా మారుతాయి. అందుకే వాటిని గది ఉష్ణోగ్రత వద్ద స్టోర్‌ చేయడమే మంచిది. కానీ వీటిని ఎక్కువ రోజులు నిల్వ ఉంచలేం. అందుకే టమోటాలను కొనేటప్పుడే పండిన వాటిని తీసుకోకూడదు. కొన్ని దోరగా ఉన్నవి కొన్ని కాయల్లా ఉన్నవి కొనాలి. ఇలా తీసుకోవడం వల్ల వాటిని వాడుకునే సమయానికి పక్వానికి వచ్చేస్తాయి..

Tags:    

Similar News