Blood Donation: ఫస్ట్‌టైమ్‌ రక్తదానం చేస్తున్నారా.? ఈ విషయాలు గుర్తుపెట్టుకోండి..

అయితే తొలిసారి రక్తదానం చేసే వారు కచ్చితంగా కొన్ని విషయాలను పరిగణలోకి తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.

Update: 2024-06-17 01:30 GMT

Blood Donation: ఫస్ట్‌టైమ్‌ రక్తదానం చేస్తున్నారా.? ఈ విషయాలు గుర్తుపెట్టుకోండి.. 

రక్తదానం ఒక గొప్ప పని. సాటి మనిషిని బతికించే అవకాశం ఉన్న రక్తదానాన్ని చేయాలని ప్రతీ ఒక్కరూ చెబుతుంటారు. అయితే రక్తదానం చేసే సమయంలో చాలా మంది ఎన్నో అపోహలు ఉంటాయి. మరీ ముఖ్యంగా తొలిసారి రక్తదానం చేసే వారిలో ఇవి ఎక్కువగా ఉంటాయి. అయితే తొలిసారి రక్తదానం చేసే వారు కచ్చితంగా కొన్ని విషయాలను పరిగణలోకి తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

* రక్తదానం చేసేందుకు మీరు అర్హులా కాదా అన్న విషయాన్ని తెలుసుకోవాలి. ముఖ్యంగా వయస్సు, బరువు, ఆరోగ్యం ఆధారంగా ఈ విషయాన్ని అంచనా వేస్తున్నారు. రక్తదాన కేంద్రాన్ని సంప్రదిస్తే మీకు ఈ విషయాలు తెలియజేస్తారు.

* రక్తదానం చేయడానికి ముందు, తర్వాత శరీరంలో డీహైడ్రేషన్‌ లేకుండా చూసుకోవాలి. శరీరం డీహైడ్రేషన్‌కు గురికాకుండా ఉండేందుకు కచ్చితంగా సరిపడ నీరు తీసుకోవాలి.

* రక్తదానం చేసే ముందు ఐరన్‌ అధికంగా ఉండే ఆహారం తీసుకోవాలి. ఇందుకోసం ఆహారంలో పాలకూర, బీన్స్, సాల్మన్ ఫిష్, చికెన్‌ వంటి ఆహారాలను తీసుకోవాలి.

* ఇక రక్తదానం చేసే ముందు రోజు కచ్చితంగా తగినంత నిద్ర ఉండాలని నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల సైడ్‌ ఎఫెక్ట్స్‌ ఎదురు కాకుండా ఉంటాయి.

* రక్త దానం చేసే సమయంలో ఏదైనా అసౌకర్యంగా అనిపించినా.. తల తిరగడం, అలసట వంటి లక్షణాలు కనిపించినా వెంటనే వైద్యులను సంప్రదించాలి.

* ఇక రక్తదానం చేసిన వెంటనే కనీసం 10-15 నిమిషాలు కూర్చుని విశ్రాంతి తీసుకోవాలి.

* రక్తదానం చేసిన వెంటనే ఏదైనా ఫ్రూట్‌ జ్యూస్‌ను తీసుకోవాలి. దీనివల్ల నీరసం నుంచి బయటపడొచ్చు.

* రక్తదానం చేసిన తర్వాత రెండు రోజుల పాటు నీటిని ఎక్కువగా తీసుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో డీహైడ్రేషన్‌కు గురి కాకుండా చూసుకోవాలి.

* రక్తదానం చేసిన రోజు ఎక్కువ బరువులు ఎత్తడం లేదా కఠినమైన వ్యాయామం చేయకూడదు.

* ఇక పురుషుల 12 వారలకు ఒకసారి, మహిళలైతే.. ప్రతీ 16 వారాలకు రక్తదానం చేయొచ్చు.

నోట్‌: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.

Tags:    

Similar News