Health: హిమోగ్లోబిన్‌ ఎక్కువైతే చాలా ప్రమాదం.. జరిగే నష్టాలు ఇవే..!

శరీరంలో హిమోగ్లోబిన్‌ స్థాయులు పరిమితికి మించి ఉంటే పలు తీవ్ర వ్యాధులు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు.

Update: 2024-08-22 05:03 GMT

Health: హిమోగ్లోబిన్‌ ఎక్కువైతే చాలా ప్రమాదం.. జరిగే నష్టాలు ఇవే.. 

శరీరంలో అన్ని జీవక్రియలు సరిగ్గా జరగాలంటే రక్త సరఫరా సవ్యంగా ఉండాలని తెలిసిందే. దీంట్లో హిమోగ్లోబిన్‌ కీలక పాత్ర పోషిస్తుంది. శరీరంలోని అన్ని అవయవాలకు ఆక్సిజన్‌ను అందించడంలో ఎర్ర రక్తకణాలు దోహదపడతాయి. ఇలాంటి కీలక పాత్ర పోషించే ఎర్రరక్త కణాలు తక్కువైతే పలు సమస్యలు వస్తాయని తెలిసిందే. అయితే హిమోగ్లోబిన్‌ తగ్గడమే కాదు, పెరిగిన నష్టాలు తప్పవని నిపుణులు చెబుతున్నారు.

శరీరంలో హిమోగ్లోబిన్‌ స్థాయులు పరిమితికి మించి ఉంటే పలు తీవ్ర వ్యాధులు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. ముఖ్యంగా గుండెపోటు, పక్షవాతం, రక్తంలో గడ్డలు లాంటి వాటి ముప్పు పెరుగుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఎముక మూలుగలో అసాధారణ పరిస్థితుల కారణంగా రక్తంలో ఎర్ర రక్తకణాలు పెరిగిపోతాయి. దీన్ని పాలిసైథీమియా అని పిలుస్తారు.

ఇలా ఎర్ర రక్త కణాలు ఎక్కువ కావడం వల్ల రక్తం మందంగా మారుతుంది. ఇది రక్త ప్రవాహాన్ని నెమ్మదిస్తుంది. ఇది రక్త సరఫాలో అంతరాయానికి దారి తీస్తుంది. స్మోకింగ్‌, గుండె, ఊపిరితిత్తుల వ్యాధులు ఉన్న వారిలో కూడా పాలిసైథీమియా వచ్చే అవకాశాలు ఉంటాయి. ఒక డెసీలీటర్‌ రక్తంలో హిమోగ్లోబిన్‌ స్థాయులు పురుషుల్లో అయితే 16.5 గ్రాములు, స్త్రీలలో అయితే 16 గ్రాములకు మించితే జాగ్రత్త పడాలని నిపుణులు చెబుతున్నారు.

అయితే హిమోగ్లోబిన్‌ పెరిగిందని చెప్పే సంకేతాలు ముందుగా గుర్తించడం కష్టం. కాబట్టి శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా ఉన్నా, కాళ్లు, చేతుల్లో వాపుగా అనిపించినా వెంటనే వైద్యులను సంప్రదించి సంబంధిత పరీక్షలు చేయించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

Tags:    

Similar News