Watching TV: టీవీ చూస్తూ నిద్రపోతున్నారా.. అయితే మీ పని అయిపోయినట్లే..!
Watching TV: నేటి ఆధునిక రోజుల్లో టీవీ చూసేవారి సంఖ్య విపరీతంగా పెరిగింది. దీనికి కారణం OTT ప్లాట్‌ఫామ్స్‌లో వస్తున్న వెబ్ సిరీస్, సినిమాలు, ప్రోగ్రాంలు.
Watching TV: నేటి ఆధునిక రోజుల్లో టీవీ చూసేవారి సంఖ్య విపరీతంగా పెరిగింది. దీనికి కారణం OTT ప్లాట్‌ఫామ్స్‌లో వస్తున్న వెబ్ సిరీస్, సినిమాలు, ప్రోగ్రాంలు. కొంతమంది ఏకంగా టీవీ చూస్తూనే నిద్రపోతున్నారు. కొవిడ్-19 తర్వాత నెట్‌ఫ్లిక్స్ వంటి OTT ప్లాట్‌ఫారమ్‌లకు ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ పెరిగింది. చాలామంది అర్థరాత్రి వరకు టీవీ చూస్తూ నిద్రపోతున్నారు. ఇక్కడి వరకు బాగానే ఉంది కానీ టీవీ చూస్తూ నిద్రించడం ఆరోగ్యానికి చాలా ప్రమాదకరం. దీనిపై నిర్వహించిన అధ్యయనంలో ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. వాటి గురించి ఈ రోజు తెలుసుకుందాం.
ఈ పరిశోధన ప్రకారం టీవీ నుంచి వచ్చే తక్కువ వెలుతురులో నిద్రిస్తున్న వ్యక్తుల ఇన్సులిన్ స్థాయి తగ్గుతుంది. దీని కారణంగా రక్తంలో చక్కెర స్థాయి పెరుగుతుంది. దీంతో మధుమేహం, అధిక రక్తపోటు ప్రమాదం పెరుగుతుంది. దీంతో గుండె జబ్బుల ముప్పు గణనీయంగా పెరుగుతోంది. మీరు తక్కువ నిద్రపోయినా లేదా ఎక్కువ సమయం స్క్రీన్‌పై గడిపినా అది మెదడుపై చెడు ప్రభావం చూపుతుందని నిపుణులు చెబుతున్నారు. మానసిక ఆరోగ్యం దెబ్బతినడం వల్ల శారీరక ఆరోగ్యం క్షీణించడం మొదలవుతుంది. దీని కారణంగా శరీరం బలహీనపడుతుంది.
యువతపై అధిక ప్రభావం
ఈ పరిశోధన యువతను మరింత ఆందోళనకు గురిచేస్తోంది. ఎందుకంటే చాలా మంది అధికంగా టీవీ చూస్తున్నారు. ఏ సమయంలోపడుకుంటున్నారో నిద్రలేస్తున్నారో తెలియడం లేదు. దీని కారణంగా కండరాల నొప్పుల సమస్యలు ఏర్పడుతున్నాయి. ప్రతిరోజూ మంచి నిద్ర పొందడానికి ధ్యానం అలవాటు చేసుకోండి. అవసరాన్ని బట్టి టీవీ లేదా ఫోన్ ఉపయోగించండి. ఆసక్తి ఉన్న పనులను చేయండి. పుస్తకాలు చదివే అలవాటు మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఆరోగ్యకరమైన ఆహారం, ఎక్కువ నీరు తాగడం చేయండి. ఆరోగ్యకరమైన అలవాట్లు శారీరక, మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.