Cooking Rice: అన్నం వండేముందు ఈ పొరపాట్లు చేయవద్దు.. చాలామంది తప్పుగా వండుతున్నారు..!

Cooking Rice: మనం ప్రతిరోజు అన్నం తింటాం. కానీ దానిని సరైన విధంగా వండారా అనేది మాత్రం గమనించాం.

Update: 2024-05-19 15:00 GMT

Cooking Rice: అన్నం వండేముందు ఈ పొరపాట్లు చేయవద్దు.. చాలామంది తప్పుగా వండుతున్నారు..!

Cooking Rice: మనం ప్రతిరోజు అన్నం తింటాం. కానీ దానిని సరైన విధంగా వండారా అనేది మాత్రం గమనించాం. ఎందుకంటే సరైన విధంగా వండితేనే అందులోని పోషకాలు మన శరీరానికి అందుతాయి. లేదంటే ఆ అన్నం తినడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు. నేటి రోజుల్లో చాలామంది అన్నం తప్పుగా వండుతున్నారు. అసలైన పోషకాలను బయటపారేసి మిగిలిన చెత్తను పోషకాహారంగా భావించి తింటున్నారు. దీనివల్ల చాలామంది చిన్న వయసులోనే అనారోగ్యానికి గురవుతున్నారు. ఈ రోజు అన్నం వండే పద్దతి గురించి తెలుసుకుందాం.

అన్నం వండడానికి ముందు ప్రజలు చాలా పెద్ద తప్పు చేస్తుంటారు. కొందరు అన్నం వండడానికి ముందు బియ్యాన్ని ఎక్కువసేపు నానబెట్టి తర్వాత చాలాసార్లు కడుగుతారు. బియ్యాన్ని పదే పదే కడగడం వల్ల అందులో ఉండే పోషకాలు నశిస్తాయి. బియ్యంలో ఉండే కరిగే ఫైబర్ నీటిలో కరిగి జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. అలాగే ఎక్కువ నీళ్లలో బియ్యాన్ని ఉడకబెట్టి ఆ నీటిని గంజి రూపంలో పారబోస్తారు. ఇది పూర్తిగా తప్పు అని నిపుణులు చెబుతున్నారు.

బియ్యాన్ని నానబెట్టి కడిగితే అన్నంలోని పోషణ అంతా తొలగిపోతుంది. అలాగే సగం అన్నం ఉడికిన తర్వాత గంజిని వంపితే అన్నంలో ఎలాంటి పోషకాలు ఉండవు. అన్నం వండేటప్పుడు ఈ రెండు తప్పులు చేయవద్దు. అన్నం వండే ముందు బియ్యాన్ని 3 సార్లు కడిగి 5 నుంచి 10 నిమిషాలు నానబెట్టి ఆ తర్వాత ఉడికించాలి. అలాగే బియ్యం పీల్చుకోగలిగినంత నీటిలో మాత్రమే ఉడికించాలి. అప్పుడే అందులోని పోషకాలు మనకు లభిస్తాయి.

Tags:    

Similar News