Health Tips: ఎండాకాలం వీటి జోలికి పోకండి.. శరీరానికి హాని జరుగుతుంది..!

Health Tips: వేసవికాలం వేడితో పాటు అనేక వ్యాధులని మోసుకొస్తుంది.

Update: 2023-06-06 00:30 GMT

Health Tips: ఎండాకాలం వీటి జోలికి పోకండి.. శరీరానికి హాని జరుగుతుంది..!

Health Tips: వేసవికాలం వేడితో పాటు అనేక వ్యాధులని మోసుకొస్తుంది. ఈ సీజన్‌లో ఆహారంపై ప్రత్యేక దృష్టిపెట్టాలి. లేదంటే చాలా ఆరోగ్య సమస్యలని ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఎండాకాలంలో కొన్ని ఆరోగ్యకరమైన ఆహారాలు కూడా శరీరానికి హాని కలిగిస్తాయి. బాదంపప్పులకు ఇదే వర్తిస్తుంది. చాలా మంది ఉదయాన్నే నిద్రలేచి బాదం పప్పు తింటారు. వాస్తవానికి బాదం తినడం ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో ప్రోటీన్, ఫైబర్, మెగ్నీషియం, విటమిన్లు ఉంటాయి. ఇవి రక్తంలో చక్కెరను తగ్గించడమే కాకుండా బరువు తగ్గడంలో సహాయపడుతాయి. అయితే బాదం గుణం వేడిగా ఉంటుంది. అందుకే వేసవి కాలంలో బాదం పప్పులను ఎక్కువగా తినకూడదు.

అతిగా తినడం హాని

ఎండాకాలం వేడిచేసే ఆహారాలని తినకూడదు. వీటివల్ల శరీరంలో వేడి ఎక్కువవుతుంది. అనేక వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంటుంది. ఎండాకాలంలో ఎండు బాదంపప్పు తినడం మానుకోవడం ఉత్తమం. కానీ నీటిలో నానబెట్టిన బాదంపప్పులను తింటే మంచిది. ఈ సీజన్‌లో బాదం పప్పు తినడం వల్ల శరీరంలో పీచుపదార్థం పెరుగుతుంది. దీని వల్ల జీర్ణక్రియ దెబ్బతింటుంది. మలబద్ధకం, కడుపు సంబంధిత సమస్యలు ఏర్పడుతాయి.

పెరిగిన అలసట, బలహీనత

బాదంపప్పులో విటమిన్లు కూడా ఉంటాయి. ఎండు బాదంపప్పులు తింటే శరీరంలో విటమిన్ ఇ పరిమాణం పెరుగుతుంది. దీని కారణంగా శరీరంలో అలసట, బలహీనత వస్తుంది. ఇది కాకుండా మొటిమలు కూడా సంభవిస్తాయి.

బాదం ఎలా తినాలి

వేసవి కాలంలో బాదంపప్పును తింటే ముందుగా 10 నుంచి 12 గంటల పాటు నీటిలో నానబెట్టాలి. దీనివల్ల బాదంపప్పులోని వేడి బయటకు వెళ్లిపోతుంది.

Tags:    

Similar News