Health Tips: ఆరెంజ్ తిన్న తర్వాత ఈ పదార్థాలు తినవద్దు.. చాలా ప్రమాదం..!
Health Tips: చలికాలంలో ఆరెంజ్ పండ్లు ఎక్కువగా లభిస్తాయి. ఇది చాలా తక్కువ ధరకి లభించే పండు.
Health Tips: చలికాలంలో ఆరెంజ్ పండ్లు ఎక్కువగా లభిస్తాయి. ఇది చాలా తక్కువ ధరకి లభించే పండు. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. ఆరెంజ్ పోషకాల పవర్ హౌస్ అని చెప్పవచ్చు. విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్స్ వంటి అనేక పోషకాలు ఉంటాయి. దీన్ని తినడం వల్ల అనేక రోగాలు దూరమవుతాయి. కానీ ఆరెంజ్ తిన్న తర్వాత కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ముఖ్యం. లేదంటే అది మీకు హాని చేస్తుంది. ఆరెంజ్ తిన్న తర్వాత ఎలాంటి పదార్థాలు తినకూడదో ఈ రోజు తెలుసుకుందాం.
ఆరెంజ్ తర్వాత పాలు
ఆరెంజ్ తిన్న తర్వాత పాలు తాగకూడదు. ఒకవేళ తాగితే అది జీర్ణక్రియపై చెడు ప్రభావాన్ని చూపుతుంది. దీంతో అజీర్ణం, మలబద్ధకం వంటి సమస్యలు తలెత్తుతాయి. దీని వల్ల చర్మ సమస్యలు ఏర్పడుతాయి.
ఆరెంజ్ తర్వాత పాన్
చాలా మంది జ్యూస్ తాగిన తర్వాత పాన్ తింటారు. కానీ మీరు ఆరెంజ్ జ్యూస్ తాగిన తర్వాత పాన్ తినకుండా ఉండాలి. నారింజ తర్వాత తమలపాకులు తింటే ఊపిరితిత్తులు దెబ్బతింటాయి. ఇది ఛాతీలో బిగుతుకు కారణం అవుతుంది.
ఆరెంజ్ తర్వాత బొప్పాయి
ఆరెంజ్ తిన్న తర్వాత బొప్పాయి పండు తినకూడదు. అంతేకాదు ఈ రెండు పండ్లు ఎప్పుడు కలిపి తినకూడదు. దీనివల్ల జీర్ణ సమస్యలు తలెత్తుతాయి. కడుపులో ఉబ్బరంగా ఉంటుంది. అంతేకాదు చర్మంపై దద్దుర్లలాంటి సమస్యలు ఎదురవుతాయి.
ఆరెంజ్ తర్వాత పెరుగు
ఆరెంజ్ తిన్న తర్వాత పెరుగు తినకూడదు. మజ్జిగ కూడా తాగకూడదు. కాసేపు సమయం కేటాయించి తర్వాత తీసుకోవాలి. వెంటనే తీసుకోవద్దు.