Health Tips: ఉదయం పూట ఈ పానీయాలు తాగవద్దు.. ఆరోగ్యానికి చాలా ప్రమాదకరం..!
Health Tips: ఒక్కోసారి మనకు తెలియకుండా ఉదయం పూట కొన్ని రకాల పానీయాలు తాగేస్తాం. ఇవి ఆరోగ్యానికి చాలా హాని చేస్తాయి.
Health Tips: ఒక్కోసారి మనకు తెలియకుండా ఉదయం పూట కొన్ని రకాల పానీయాలు తాగేస్తాం. ఇవి ఆరోగ్యానికి చాలా హాని చేస్తాయి. నిజానికి ఉదయం బలవర్ధకమైన ఆహారం తీసుకోవాలి. దీనివల్ల రోజు మొత్తం మనం యాక్టివ్ గా ఉంటాం చురుకుగా పనిచేస్తాం. ఇందుకోసం మంచి డైట్ ఫాలో కావాలి. అయితే ఉదయం పూట తాగకూడదని కొన్ని రకాల పానీయాలు ఉంటాయి. వాటి జోలికి అస్సలు వెళ్లకూడదు. ఈ రోజు అలాంటి పానీయాల గురించి తెలుసుకుందాం.
సోడా, కార్బోనేటేడ్ పానీయాలు
ఉదయం పూట సోడా లేదా ఏదైనా కార్బోనేటేడ్ డ్రింక్స్ తాగడం మంచిదికాదు. ఇందులో అధిక మొత్తంలో చక్కెర, కెఫిన్ కలిసి ఉంటాయి. ఇది మీ శరీరానికి తక్షణ శక్తిని అందిస్తుంది. కానీ కొంత సమయం తర్వాత మీరు అలసటకు గురవుతారు. ఇది కాకుండా వీటిలో ఉండే కార్బన్ డయాక్సైడ్ కడుపులో గ్యాస్, ఉబ్బరం సమస్యలను కలిగిస్తుంది.
ఎనర్జీ డ్రింక్స్
ఎనర్జీ డ్రింక్స్‌లో అధిక మొత్తంలో కెఫిన్, షుగర్ ఉంటాయి. ఇవి శరీరానికి హాని కలిగిస్తాయి. ఉదయాన్నే వీటిని తాగడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు ఒక్కసారిగా పెరుగుతాయి. దీని కారణంగా రోజంతా శక్తి లేకపోవడం అలసటగా అనిపిస్తుంది. ఇది కాకుండా ఎనర్జీ డ్రింక్స్ హార్ట్ బీట్, రక్తపోటును పెంచుతాయి ఇది ఆరోగ్యానికి ప్రమాదకరం.
టీ లేదా కాఫీ
ఉదయం పూట టీ, కాఫీలు తీసుకోవడం సర్వసాధారణం అయితే వాటిలో ఎక్కువగా చక్కెర వేసి తాగకూడదు. ఇది ఆరోగ్యానికి హానికరం. అధిక చక్కెర వినియోగం బరువు పెరగడం, మధుమేహం, ఇతర ఆరోగ్య సమస్యలను కలిగిస్తుంది. చక్కెర లేకుండా టీ లేదా బ్లాక్ కాఫీ తీసుకుంటే పర్వాలేదు.
ప్యాకేజ్డ్ ఫ్రూట్ జ్యూస్
ప్యాక్ చేసిన పండ్ల రసాల్లో అధిక మొత్తంలో చక్కెర ఉంటుంది. ఇవి ఆరోగ్యానికి హానికరం. ఈ జ్యూస్ లో ఫైబర్ ఉండదు. ప్రాసెసింగ్ సమయంలో పోషకాలు నాశనమవుతాయి. అందువల్ల తాజా పండ్లను తీసుకోవడం ఉత్తమం.