Beauty Tips: ఈ పదార్థాలను కలబందతో కలిపి ముఖానికి అప్లై చేయవద్దు.. చాలా ఇబ్బంది పడుతారు..!

Beauty Tips: కలబందలో ఆయుర్వేద గుణాలు పుష్కలంగా ఉంటాయి. దీనిని ఔషధాల తయారీలో కూడా వినియోగిస్తారు.

Update: 2024-05-28 08:50 GMT

Beauty Tips: ఈ పదార్థాలను కలబందతో కలిపి ముఖానికి అప్లై చేయవద్దు.. చాలా ఇబ్బంది పడుతారు..!

Beauty Tips: కలబందలో ఆయుర్వేద గుణాలు పుష్కలంగా ఉంటాయి. దీనిని ఔషధాల తయారీలో కూడా వినియోగిస్తారు. బ్యూటీ ప్రొడాక్ట్స్‌ల తయారీలో వాడుతారు. కలబంద చర్మంతో పాటు జుట్టుకు కూడా మేలు చేస్తుంది.దీనిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ గుణాలు అనేక చర్మ సమస్యలను దూరం చేస్తాయి. ఇది చర్మాన్ని తేమగా ఉంచడానికి పనిచేస్తుంది. ముఖంపై నిగారింపు వచ్చేలా చేస్తుంది. అలోవెరాలో విటమిన్ ఎ, ఇ తోపాటు పలు పోషకాలు ఉన్నాయి. ఇది చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సాయపడుతాయి. అయితే కొంతమంది కలబందతో కొన్ని పదార్థాలు కలిపి ఫేస్‌కి అప్లై చేస్తూ ఉంటారు. దీనివల్ల వారి ముఖం పాడవుతుంది. అలాంటి వాడకూడని పదార్థాల గురించి తెలుసుకుందాం.

ముఖానికి కలబంద జెల్ లో నిమ్మరసాన్ని కలిపి అప్లై చేయకూడదు. నిమ్మరసం చర్మానికి హాని కలిగించే ఆమ్ల లక్షణాలను కలిగి ఉంటుంది. ఇది నేరుగా ప్రభావం చూపుతుంది. మీ చర్మం సున్నితమైనదైతే ఏదైనా ప్రయోగం చేసే ముందు వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది. సెన్సిటివ్ స్కిన్ ఉన్నవారు నిమ్మరసాన్ని ముఖానికి రాసుకుంటే దద్దుర్లు, చర్మం ఎర్రబడడం, దురద వంటి సమస్యలు వస్తాయి. వీటన్నింటికీ బదులుగా చర్మ సమస్యలను నివారించడానికి అలోవెరా జెల్‌ను నేరుగా అప్లై చేసి 15 నిమిషాల తర్వాత ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి.

సోషల్ మీడియాలో కలబందలో ఇది కలిపి రాస్తే ముఖం తెల్లగా మారుతుందని చెబుతుంటారు. కానీ ఇలాంటి పుకార్లను నమ్మొద్దు. ఇటీవల టూత్‌పేస్ట్ సాయంతో మెరిసే చర్మాన్ని పొందవచ్చని వైరల్ చేస్తున్నారు. ఇది పూర్తిగా నకిలీదని వైద్యులు నిర్దారించారు. ఇలాంటి ప్రయోగాలు ఎప్పుడు చేయవద్దు. అలాగే బేకింగ్ సోడా దుస్తులపైనున్న మరకలను తొలగించడానికి ఉపయోగిస్తారు. అలోవెరా జెల్‌తో కలిపి ఫేస్‌కు అప్లై చేయకూడదు. ఇటీవల ఇలాంటి కొన్ని సంఘటనలు జరుగుతున్నాయి. ఇలాంటివి నమ్మి మోసపోవద్దు. కలబంద ఎప్పుడైనా సహజసిద్దంగా వాడాలని గుర్తుంచుకోండి.

Tags:    

Similar News