Parenting Tips: మీ పిల్లలకు ప్లాస్టిక్ టిఫిన్ బాక్సులు ఇస్తున్నారా? ముందు ఈ విషయం తెలుసుకోండి

Plastic Boxes : చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలకు రకరకాల కలర్స్, డిజైన్స్ లో ఉండే ప్లాస్టిక్ టిఫిన్ బాక్సుల్లో లంచ్ పెడుతుంటారు. కానీ పిల్లల ఆరోగ్యానికి ఎంత హాని చేస్తుందో తెలుస్తే మీరు షాక్ అవుతారు.

Update: 2024-08-15 06:07 GMT

Parenting Tips: మీ పిల్లలకు ప్లాస్టిక్ టిఫిన్ బాక్సులు ఇస్తున్నారా? ముందు ఈ విషయం తెలుసుకోండి

Plastic Boxes : మనలో చాలా మంది పేరేంట్స్ పిల్లలకు రంగురంగుల టిఫిన్స్ బాక్సుల్లోలంచ్, స్నాక్స్ పెడుతుంటారు. అయితే ప్లాస్టిక్ అనేది పిల్లల ఆరోగ్యానికి ఎంత హాని కలిగిస్తుందో తెలియదు.వేడి, వేడి ఆహారాన్ని ప్లాస్టిక్ బ్యాక్సల్లో ప్యాక్ చేయడం వల్ల అందులోని హానికరమైన రసాయనాలు పిల్లల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఈ ప్లాస్టిక్ బాక్సులు పిల్లలకు స్లో పాయిజన్ గా మారుతున్నాయని చెబుతున్నారు. వేడి వేడి ఆహారాన్ని ప్లాస్టిక్ బాక్సుల్లో పెట్టడం వల్ల ప్లాస్టిక్ విచ్ఛిన్నమై చిన్న చిన్న రేణువులుగా మారుతాయి. దీనిని మైక్రోప్లాస్టిక్ అని కూడా అంటారు.

ఇవి ఆహారంతో కలపడం ద్వారా పిల్లల శరీరంలోకి ప్రవేశిస్తాయి. దీని కారణంగా పిల్లల రోగనిరోధక శక్తి బలహీనపడుతుంది. అంతేకాదు అనేక వ్యాధులు చుట్టుముడతాయి. ప్లాస్టిక్ టిఫిన్లలో బ్యాక్టీరియా సులభంగా ఏర్పడుతుంది. అంతేకాదు కొన్ని హాట్ బాక్సులను సరిగ్గా క్లీన్ చేయకపోవడం వల్ల అందులో బ్యాక్టీరియా పేరుకుపోతుంది. అంతేకాదు ప్లాస్టిక్ పాత్రను ఎక్కువగా రుద్ది కడగటం వల్ల వాటి పొర ఊడటం మొదలవుతుంది. ఇది ఆహారంలో కలిసిపోవడం వల్ల ప్లాస్టిక్ సులభంగా పిల్లల శరీరంలోకి ప్రవేశిస్తుంది. ప్లాస్టిక్ బదులు పిల్లలకు లంచ్ బాక్స్, స్నాక్స్ బాక్స్ ఇవన్నీ కూడా స్టిల్ పాత్రలను ఉపయోగించడం మంచిదని చెబుతున్నారు. లేదంటే స్టీల్ కు బదులుగా గ్లాస్ టిఫిన్ కూడా ఇవ్వొచ్చు.

ప్లాస్టిక్ లో ఉండే కొన్ని రసాయనాలు హార్మోన్ల సమతుల్యతను దెబ్బతీస్తాయని వైద్యులు చెబుతున్నారు. దీని వల్ల షుగర్ వంటి వ్యాధులు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఇలా రోజు ప్లాస్టిక్ బాక్సులను ఉపయోగిస్తే థైరాయిడ్ వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. ప్లాస్టిక్ లో ఉండే రసాయనాలు చర్మం అలెర్జీలు వంటి సమస్యలను కలిగిస్తాయి. కొన్నిసార్లు చాలా వేడి ఆహారాన్ని ప్లాస్టిక్ కంటైనర్లలో ప్యాక్ చేయడం వల్ల ప్లాస్టిక్ కరిగిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ప్లాస్టిక్ కవర్లలో షాపుల్లో సాంబారు, పెరుగు, కూరలు, చట్నీలు కూడా తీసుకోకూడదు. నాణ్యమైన ప్లాస్టిక్ వస్తువులు వాడితే అంతగా హాని ఉండదు.

Tags:    

Similar News