Toilet Screen Time: బాత్రూమ్ లో ఫోన్ వాడే అలవాటు ఉందా? అయితే మీ శరీరంలో ఆ పార్ట్ పనిచేయదు ఇక
Toilet Screen Time: ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ జీవితంలో ఓ భాగమైంది. ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేంత వరకు ప్రతిఒక్కరూ స్మార్ట్ ఫోన్ లేనిది క్షణం ఉండలేని పరిస్థితి నెలకంది. చివరికి టాయిలెట్ వెళ్తే కూడా ఫోన్ ఉండాల్సిందే. ఏవైనా ఫోన్ కు సంబంధించిన పనులు ఉంటే కూడా టాయిలెట్ సీటుమీదనే కూర్చుండి చెక్ చేస్తుంటారు. ఇలా బాత్రూమ్ లోనే ఎక్కువ సమయం కేటాయిస్తుంటారు. బాత్రూమ్ లో ఫోన్ వాడటం వల్ల వచ్చే అనారోగ్య సమస్యల గురించి చాలా మందికే తెలిసే ఉంటుంది. అయినప్పటికీ తరచుగా బాత్రూమ్ లో ఫోన్ వాడుతుంటే శరీరంలోని ఓ అవయవం పనిచేయదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
Toilet Screen Time: ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ జీవితంలో ఓ భాగంగా మారింది. ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునేంత వరకు చేతిలో స్మార్ట్ ఫోన్ ఉండాల్సిందే. చివరికి బాత్రూమ్ కు వెళ్తే కూడా ఫోన్ తీసుకెళ్తుంటారు. టాయిలెట్ సీటుపై కూర్చొని చాలా మంది వాడుతుంటారు. అయితే మనం టాయిలెటు సీట్ పై ఎక్కువ సమయం గడిపితే ఇన్ఫెక్షన్ల బారిన పడే అవకాశం ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా టాయిలేట్ రూపంలో 10 నిమిషాల కంటే ఎక్కువ సమయం బాత్రూమ్ లో అస్సలు గడపకూడదట. ఎందుకంటే ఇలా ఎక్కువ సమయం ఒకే భంగిమలో కూర్చున్నట్లయితే అనారోగ్య సమస్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు.
టాయిలెట్ లో మన శరీరంపై ఫోకస్ పెట్టడం చాలా ముఖ్యం. ఎందుకంటే టాయిలెట్ సీటుపై ఎక్కువ సమయం ఇలా ఒకే భంగమలో కూర్చొంటే నడుముపై అధిక ఒత్తిడి పెరుగుతుంది. దీంతో నడుము నొప్పి సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంది. ఈ నొప్పి పెరిగితే సమస్య మరింత ఎక్కువై నిలబడి..నడవలేని స్థితికి చేరుకునే ప్రమాదం కూడా ఉంటుంది. అంతేకాదు కండరాల్లో వాపు, తిమ్మిరి సమస్యలు కూడా వచ్చే ప్రమాదం ఉంది.
టాయిలెట్ సీటుపై కూర్చుని ఉంటే పాయివుపై ఒత్తిడి పెరుగుతుంది. దీంతో వాపు సమస్యలు రావడంతోపాటు దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలకు గురవుతారు.అంతేకాదు ఈ ఒత్తిడి ఫైల్స్ కు దారి తీస్తుంది. దీంతో తీవ్ర అనారోగ్య సమస్యలు కూడా వస్తాయని నిపుణులు చెబుతున్నారు. అందుకే ఎక్కువ సమయం టాయిలెట్ సీటుపై కూర్చోవడం మంచిది కాదని చెబుతున్నారు.
అంతేకాదు టాయిలెట్ సీటుపై ప్రమాదకరమైన బ్యాక్టీరియా ఉంటుంది. మీరు అక్కడే మొబైల్ వాడితే..ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. అందుకే టాయిలెట్ లోకి ఫోన్ తీసుకువెళ్లడం అస్సలు మంచిది కాదు.
(నోట్: ఈ స్టోరీ ఇంటర్నేట్ లో అందుబాటులో ఉన్న సమాచారం మేరకు రాసినది మాత్రమే. హెచ్ఎంటీవీ దీనిని ధ్రువీకరించడం లేదు. )