Diabetics : డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు పాలు తాగొచ్చా...పరిశోధనలో కీలక విషయాలు వెల్లడి

Diabetics : ఈ రోజుల్లో వయస్సుతో సంబంధం లేకుండా ఎంతో మందిని మధుమేహం వేధిస్తోంది. ఈ క్రమంలోనే డయాబెటిస్ ఉన్నవారు ఏది తినాలనుకున్నా..తాగాలనుకున్నా కాస్త ఆలోచించాల్సి వస్తుంది. డయాబెటిస్ తో బాధపడేవారు పాలు తాగవచ్చా. తాగితే ఏం జరుగుతుంది. ఈ విషయాలపై తాజా అధ్యయనం ఏం చెబుతుందో తెలుసుకుందాం.

Update: 2024-08-22 05:57 GMT

Diabetics : డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు పాలు తాగొచ్చా...పరిశోధనలో కీలక విషయాలు వెల్లడి

Diabetics : నేటికాలంలో మారుతున్న జీవనశైలి కారణంగా చాలా మంది డయాబెటిస్ సమస్యలను ఎదుర్కొంటున్నారు. వయస్సుతో సంబంధం లేకుండా ఈ వ్యాధి బారినపడుతున్నారు. డయాబెటిస్ సోకిందంటే ఆహారం, జీవనశైలి విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా కొన్ని ఆహారాలు, పానీయాలకు దూరంగా ఉండాలని వైద్యులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే షుగర్ వ్యాధిగ్రస్తులు చాలా మందికి పాలు తాగవచ్చా. తాగకూడదా అనే సందేహం ఉంటుంది. మరి డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు పాలు తాగవచ్చా. తాగితే ఏం జరుగుతుంది. నిపుణులు ఏం అంటున్నారో ఇప్పుడు చూద్దాం.

షుగర్ ఉన్నవారు ఆరోగ్యం, ఆహారపు అలవాట్ల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. లేదంటే రక్తంలో షుగర్ లెవల్స్ పెరిగి తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారి తీసే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా సరైన పోషకాహారం తీసుకోవడం చాలా ముఖ్యం. ఈ క్రమంలో చాలా మంది పాలలో పోషకాలు ఉంటాయని తాగుతారు. వాస్తవానికి పాలలో ఉండే కాల్షియం, విటమిన్ డి, ప్రొటీన్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. కానీ షుగర్ ఉన్నవారు పాలు తీసుకునే ముందు కొంత జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు నిపుణులు.

2019లో అమెరికన్ సొసైటీ ఫర్ న్యూట్రిషన్ అనే జర్నల్లో ప్రచురించిన ఓ అధ్యయనం ప్రకారం..తక్కువ కొవ్వు ఉన్న పాలు టైప్ 2 డయాబెటిస్ ప్రమాదాన్ని తగ్గిస్తాయని గుర్తించారు. ఈ పరిశోధనలో స్పెయిన్​లోని యూనివర్శిటీ ఆఫ్ కాస్టిల్లా-లా మంచాకు చెందిన డాక్టర్ Celia Alvarez Bueno పాల్గొన్నారు.ప్రొటీన్, కాల్షియం ఎక్కువగా ఉండే పాలు డయాబెటిస్ వ్యాధిగ్రస్తులకు చాలా బాగా మేలు చేస్తాయని చెబుతున్నారు. ఎందుకంటే ప్రొటీన్ అధికంగా ఉండే పాలలో 9 ముఖ్యమైన అమైనో ఆమ్లాలు ఉంటాయి.

ఇవి రక్తంలో షుగర్ లెవల్స్ ను కంట్రోల్లో ఉంచడానికి సహాయపడతాయని సూచిస్తున్నారు. అలాని పాలు అధికంగా తీసుకోవడం కూడా మంచిది కాదు. ఎక్కువగా తాగడం వల్ల సైడ్ఎఫెక్ట్స్ ఉంటాయని చెబుతున్నారు. అన్నింటి కంటే ముఖ్యంగా డయాబెటిస్ ఉన్నవారు..ఎప్పుడు కూడా తక్కువ కొవ్వు ఎక్కువగా ఫైబర్ ఉండే సమతుల్య ఆహారం తీసుకోవడం చాలా మంచిదని వైద్యులు చెబుతున్నారు. 

Tags:    

Similar News