Health Tips: విటమిన్ B9 లోపం చాలా ప్రమాదం.. శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తాయి జాగ్రత్త..!

Health Tips: శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి విటమిన్లు అవసరం.

Update: 2022-11-21 12:35 GMT

Health Tips: విటమిన్ B9 లోపం చాలా ప్రమాదం.. శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తాయి జాగ్రత్త..!

Health Tips: శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి విటమిన్లు అవసరం. ఇందులో విటమిన్ B9 అంటే ఫోలిక్ యాసిడ్ చాలా ముఖ్యమైనది. ఇది శరీరంలో దెబ్బతిన్న కణాలను రిపేర్ చేస్తుంది. అంతేకాదు పురుషులలో సంతానోత్పత్తిని పెంచడంలో, ఒత్తిడి, క్యాన్సర్ వంటి తీవ్రమైన వ్యాధులను దూరం చేయడంలో సహాయపడుతుంది. విటమిన్ బి9 లోపం వల్ల శరీరంలో అనేక రకాల సమస్యలు మొదలవుతాయి. వాటి గురించి ఈ రోజు వివరంగా తెలుసుకుందాం.

శరీరంలో రక్తహీనత

విటమిన్ బి లోపం మొదటి లక్షణం రక్తహీనత. శరీరంలో ఎర్ర రక్త కణాలను తయారు చేయడానికి ఫోలిక్ యాసిడ్ చాలా ముఖ్యమైనది. శరీరంలో విటమిన్ బి9 లోపం ఉన్నపుడు ఎర్రరక్తకణాల సంఖ్య తగ్గుతుంది. అందుకే శరీరంలో రక్తం లోపం ఉంటే నిర్లక్ష్యం చేయవద్దు.

బలహీనత

మీరు నిరంతరం అలసిపోయినట్లు అనిపిస్తే అది విటమిన్ B9 లోపం లక్షణం కావచ్చు. ఎందుకంటే ఎర్రరక్త కణాల సంఖ్య తగ్గినప్పుడు ఆక్సిజన్ శరీరంలోని అన్ని భాగాలకు చేరదు. దీని కారణంగా అలసట వస్తుంది. అంతే కాదు విటమిన్ బి9 లేకపోవడం వల్ల చర్మం రంగు పసుపు రంగులోకి మారుతుంది.

జుట్టు తెల్లబడటం

విటమిన్ బి9 లోపం వల్ల జుట్టు నెరసిపోతుంది. జుట్టు ఆరోగ్యంగా ఉండటానికి ఫోలిక్ యాసిడ్ చాలా ముఖ్యం. జుట్టు చిన్న వయస్సులోనే తెల్లగా మారినట్లయితే శరీరంలో B9 లోపం ఉండవచ్చు. కాబట్టి నిర్లక్ష్యం చేయవద్దు.

విటమిన్ B9 ఆహారాలు

విటమిన్ B9లోపాన్ని భర్తీ చేయడానికి కిడ్నీ బీన్స్, గుడ్లు, బాదం, సోయాబీన్స్ వంటి వాటిని ఆహారంలో చేర్చుకోవాలి.

Tags:    

Similar News