Vitamin B6 Deficiency: విటమిన్ బి6 లోపిస్తే చాలా ప్రమాదం.. నివారించడానికి తరచుగా వీటిని తినండి..!
Vitamin B6 Deficiency: మనిషి ఆరోగ్యంగా ఉండడానికి శరీరానికి కావాల్సిన పోషకాలు, విటమిన్లు కచ్చితంగా అందించాలి.
Vitamin B6 Deficiency: మనిషి ఆరోగ్యంగా ఉండడానికి శరీరానికి కావాల్సిన పోషకాలు, విటమిన్లు కచ్చితంగా అందించాలి. లేదంటే అనారోగ్యానికి గురై ఆస్పత్రుల చుట్టూ తిరగాల్సి ఉంటుంది. శరీరానికి ముఖ్యమైన వాటిలో విటమిన్ బి 6 ఒకటి. దీనిని పొందకపోతే బలహీనత, అలసట, ఆకలి లేకపోవడం, వాంతులు, విరేచనాలు, బరువు తగ్గడం, చేతులు, కాళ్లు తిమ్మిరి వంటి సమస్యలను ఎదుర్కొంటారు. ఈ విటమిన్ అవసరాన్ని తీర్చడానికి ఎలాంటి ఆహారాలు తినాలో ఈ రోజు తెలుసుకుందాం.
విటమిన్ B6 ని పైరిడాపిరిడాక్సిన్ అని కూడా పిలుస్తారు. ఇది నీటిలో కరిగే విటమిన్. ఇది అనేక ఆహారాలలో సహజంగా లభిస్తుంది. ఈ విటమిన్ సాయంతో అనేక వ్యాధులను నివారించవచ్చు. శరీరంలో తగినంత రక్తాన్ని మెయింటెన్ చేయడానికి ఇది సాయపడుతుంది. విటమిన్ బి అధికంగా ఉండే ఆహారాన్ని తినడం వల్ల కలిగే అతిపెద్ద ప్రయోజనం ఏంటంటే ఇది క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
1. పాలు
ఆవు మేక పాలు ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా ఉంటాయి. వీటి ద్వారా విటమిన్ B6 అవసరాలను తీర్చవచ్చు. ఈ పోషకం లోపం ఉంటే అది నాడీ వ్యవస్థపై చెడు ప్రభావాన్ని చూపుతుంది. అన్ని వయసుల వారు ఈ పాలను తాగాలి.
2. సాల్మన్
సాల్మన్ ఫిష్‌ని సీఫుడ్‌లో హెల్తీ డైట్ కేటగిరీలో ఉంచారు.ఈ కొవ్వు చేపలో విటమిన్ బి6 పుష్కలంగా ఉంటుంది. ఇది మన అడ్రినల్ ఆరోగ్యానికి చాలా ముఖ్యమైనది. అడ్రినల్ గ్రంథులు కార్టిసాల్, అడ్రినలిన్, ఆల్డోస్టెరాన్‌తో సహా అనేక ముఖ్యమైన హార్మోన్లను ఉత్పత్తి చేస్తాయి. ఇది కాకుండా సాల్మన్ చేప తక్కువ కొవ్వు ఆహారం దీనిని తినడం ద్వారా ప్రోటీన్ పుష్కలంగా లభిస్తుంది.
3. క్యారెట్
క్యారెట్ పోషకాల కొరత లేని ఆహారం. ఒక మీడియం సైజు క్యారెట్‌లో ఒక గ్లాసు పాలలో ఉన్నంత విటమిన్ B6 ఉంటుంది. మీరు ఈ కూరగాయను నేరుగా తినవచ్చు. అయినప్పటికీ చాలా మంది దీనిని సలాడ్ రూపంలో తినడానికి ఇష్టపడతారు.
4. బచ్చలికూర
బచ్చలికూరను ఎల్లప్పుడూ ఆకుకూరల్లో పోషకాలు అధికంగా ఉండే ఆహారంగా పరిగణిస్తారు. విటమిన్ బి6తో పాటు విటమిన్ ఎ, విటమిన్ సి, ఐరన్ పుష్కలంగా ఉంటాయి. దీనిని సలాడ్ లేదా జ్యూస్ రూపంలో తీసుకోవడం వల్ల శరీరానికి చాలా ప్రయోజనాలను అందిస్తుంది.