Health Tips: ఈ విటమిన్ల లోపం కారణంగా కంటిచూపు మందగిస్తుంది.. అవేంటంటే..?

Health Tips: ఈ విటమిన్ల లోపం కారణంగా కంటిచూపు మందగిస్తుంది.. అవేంటంటే..?

Update: 2022-12-11 07:14 GMT

Health Tips: ఈ విటమిన్ల లోపం కారణంగా కంటిచూపు మందగిస్తుంది.. అవేంటంటే..?

Health Tips: వృద్ధాప్యంతో కంటి చూపు కోల్పోవడం సహజమైన ప్రక్రియ. దీని నుంచి ఎవరూ తప్పించుకోలేరు. కానీ చిన్న వయస్సులోనే కళ్లు మసకబారితే అది ఆందోళన కలిగించే విషయం. శరీరంలో చాలా ముఖ్యమైన పోషకాల లోపం ఉందని అర్థం. సాధారణంగా 4 విటమిన్ల లోపం వల్ల ఇలా జరుగుతుందని వైద్యులు చెబుతున్నారు. దీన్ని నివారించడానికి ఏం తినాలో ఈ రోజు తెలుసుకుందాం.

విటమిన్-సి లోపం ఉండకూడదు

కంటి చూపును బలోపేతం చేయడానికి విటమిన్ సి మెరుగైన పోషకంగా చెబుతారు. జామ, ఉసిరి, అరటి, నారింజ, నిమ్మ వంటి పండ్లని తీసుకోవడం ద్వారా ఈ పోషకాన్ని పొందవచ్చు. ఆహారంలో వీటిని చేర్చుకోవడం వల్ల క్రమంగా కంటి చూపు బలపడటం మొదలవుతుంది. అస్పష్టమైన దృష్టి సమస్య తొలగిపోతుంది.

విటమిన్ ఈ

విటమిన్ ఈ కంటి నరాలను బలపరుస్తుంది. ఫ్రీ రాడికల్స్ నుంచి శరీరాన్ని రక్షిస్తుంది. ఇది శరీరంలో యాంటీ ఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది. సాల్మన్ చేపలు, అవకాడో, గింజలు లేదా ఆకు కూరలు తీసుకోవడం వల్ల ఈ విటమిన్ పొందవచ్చు.

ఆకు కూరలు

కళ్ళు అస్పష్టంగా ఉన్నట్లు సమస్య ఉంటే అది విటమిన్ బి లోపం వల్ల సంభవిస్తుంది. ఇందులో విటమిన్-బి6, బి9, బి12 ఉంటాయి. పాల ఉత్పత్తులు, ఆకు కూరలు, పప్పులు, డ్రై ఫ్రూట్స్, బీన్స్, గింజలు, మాంసాన్ని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల ఈ విటమిన్లన్నింటినీ తిరిగి పొందవచ్చు.

విటమిన్-ఎ లోపం

మన శరీరంలో కంటి చూపుకు విటమిన్ ఎ చాలా ముఖ్యమైనది. ఇది కళ్ల బయటి పొరను రక్షిస్తుంది. ఈ పోషకం లోపం వల్ల రేచీకటి ఏర్పడుతుంది. దీని వల్ల రాత్రిపూట కళ్లు కనిపించవు. ఇలాంటి పరిస్థితి మీకు రాకుండా ఉండాలంటే క్యారెట్, బత్తాయి, గుమ్మడి, బొప్పాయి, పచ్చి ఆకు కూరలు ఎక్కువగా తీసుకోవాలి.

Tags:    

Similar News