Weak Eyesight: కంటిచూపు పెరగాలంటే ఈ పోషకాలు కచ్చితంగా అవసరం..!
Weak Eyesight: కంటిచూపు పెరగాలంటే ఈ పోషకాలు కచ్చితంగా అవసరం..!
Weak Eyesight: కళ్ళు లేకుంటే జీవితం అంధకారం. కళ్లు చాలా సున్నిత అవయవాలు. వాటి ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉంటుంది. ప్రతి ఒక్కరు కళ్ల ఆరోగ్యాన్ని గమనించాలి. కంటి చూపు బలహీనంగా మారినప్పుడు సరైన పోషకాలు అందడంలేదని గుర్తించాలి. ఇలాంటి సమయంలోనే జాగ్రత్తగా ఉండాలి. లేదంటే అద్దాలు వచ్చే అవకాశం ఉంటుంది. శక్తివంతమైన విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు, ఖనిజాలను తీసుకోవడం వల్ల కంటి ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది.
1. లుటీన్ & జియాక్సంతిన్
లుటీన్, జియాక్సంతిన్ దీర్ఘకాలిక కంటి వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తాయని అనేక పరిశోధనల్లో తేలింది. లుటీన్, జియాక్సంతిన్ ఎక్కువగా ఉన్నవారిలో కంటిశుక్లం వచ్చే ప్రమాదం చాలా తక్కువ. దీని కోసం బ్రోకలీ, మొక్కజొన్న, బఠానీలు ఎక్కువగా తీసుకోవాలి.
2. విటమిన్ సి
విటమిన్ సి కంటిశుక్లం ప్రమాదాన్ని తగ్గిస్తుందని అనేక అధ్యయనాలు చెబుతున్నాయి. ఇది వృద్ధాప్యం, అస్పష్టమైన దృష్టిని నివారిస్తుందని అనేక శాస్త్రీయ ఆధారాలు సూచిస్తున్నాయి. ఇందుకోసం నారింజ, ద్రాక్ష, స్ట్రాబెర్రీ, బొప్పాయి, పచ్చిమిర్చి, టమోటాలు, నిమ్మకాయలు తినడానికి ప్రయత్నించండి.
3. విటమిన్ ఈ
విటమిన్ ఈ ఫ్రీ రాడికల్స్ నుంచి కళ్లని కాపాడుతుంది. ఇవి ఆరోగ్యకరమైన కణాలను విచ్ఛిన్నం చేయడానికి పని చేస్తాయి. విటమిన్ E ఎక్కువగా కూరగాయల నూనెలలో లభిస్తుంది. గింజలు, గోధుమలు, చిలగడదుంపలు తినాలి.
4. ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్
ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ రెటీనా పనితీరుకు చాలా ముఖ్యమైనవి. దీని కోసం సాల్మన్, ట్యూనా, ఇతర నీటి చేపల తీసుకోవడం మంచిది.
5. జింక్
జింక్ అస్పష్టమైన దృష్టి, రేచీకటి, కంటిశుక్లం నివారించడానికి పనిచేస్తుంది. మీ శరీరంలో జింక్ లోపం ఉండకూడదు. దీని కోసం గింజలు,విత్తనాలు, రెడ్ మీట్ తీసుకోవచ్చు.