Health Tips: ఒమేగా 3 లోపం అనేక ఆరోగ్య సమస్యలకి కారణం.. అందుకే ఈ ఆహారాలు తప్పనిసరి..!
Health Tips: ఆరోగ్యంగా ఉండాలంటే పౌష్టికాహారాన్ని డైట్‌లో చేర్చుకోవడం అవసరం.
Health Tips: ఆరోగ్యంగా ఉండాలంటే పౌష్టికాహారాన్ని డైట్‌లో చేర్చుకోవడం అవసరం. పోషకాల సమతుల్యత క్షీణిస్తే శరీరంలో వ్యాధులు మొదలవుతాయి. అలాంటి పోషకాలలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్ ఒకటి. ఇది శరీరంలో చాలా తక్కువ మొత్తంలో ఉంటుంది కానీ దీని లోపం అనేక వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుంది. ఒమేగా 3 కొవ్వు ఆమ్లాల లోపం అలసట, బలహీనమైన జ్ఞాపకశక్తి, పొడి చర్మం, గుండె సమస్యలు వంటి సమస్యలను పెంచుతుంది. ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్‌ల లోపాన్ని ఏయే ఆహారపదార్థాల ద్వారా కవర్ చేయవచ్చో ఈ రోజు తెలుసుకుందాం.
పాలకూర
పచ్చి కూరగాయలలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా లభిస్తాయి. రోజువారీ ఆహారంలో పాలకూర అనేక రకాల ఆకుకూరలను చేర్చుకుంటే మంచిది.
సోయాబీన్
సోయాబీన్ ప్రోటీన్‌కి గొప్ప మూలమని చెప్పవచ్చు. శాకాహారులకు సోయాబీన్ ఉత్తమ ఎంపిక. అయితే ఇది శరీరానికి ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలను అందిస్తుంది అని కొంతమందికి మాత్రమే తెలుసు. ఫైబర్, మెగ్నీషియం, ఫోలేట్ కూడా ఇందులో ఉంటాయి.
వాల్నట్
ఆరోగ్య నిపుణులు వాల్ నట్స్ తినాలని సూచిస్తున్నారు. వీటిని క్రమం తప్పకుండా తింటే ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు సమృద్ధిగా ఉండటమే కాకుండా విటమిన్ ఈ, మెగ్నీషియం, కాపర్, వంటి పోషకాలు శరీరానికి అందుతాయి.
గుడ్డు
ఇప్పుడు గుడ్లు కూడా సూపర్‌ఫుడ్‌గా చెప్పవచ్చు. మనలో చాలా మంది అల్పాహారంగా గుడ్లు తినడానికి ఇష్టపడతారు. ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు ఇందులో పుష్కలంగా ఉంటాయి. దీంతో పాటు ప్రోటీన్, విటమిన్ ఈ లభిస్తాయి.
చేపలు
చాలా మంది చేపలు తినడానికి ఇష్టపడతారు. ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇందులో ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు, ప్రోటీన్, మెగ్నీషియం, విటమిన్ B5, పొటాషియం ఉన్నాయి. దీని కోసం మీరు సాల్మన్, ట్యూనా చేపలను తినవచ్చు.