Curry Leaves: కరివేపాకు ఈ 4 వ్యాధులకు దివ్యౌషధం.. ప్రతిరోజు ఇలా తీసుకోండి..!
Curry Leaves: కూరలో వచ్చిన కరివేపాకును చాలామంది తీసి పక్కనబెడుతారు. కానీ అందులోనే అద్భుత ఔషధగుణాలున్నాయని చాలా మందికి తెలియదు.
Curry Leaves: కూరలో వచ్చిన కరివేపాకును చాలామంది తీసి పక్కనబెడుతారు. కానీ అందులోనే అద్భుత ఔషధగుణాలున్నాయని చాలా మందికి తెలియదు. కరివేపాకు ఆహారపు వాసన, రుచిని పెంచుతుంది. దీనిని వేయించేటప్పుడు ఇల్లు మొత్తం దీని పరిమళం గుబాలిస్తుంది. దీనిలో ఉండే పోషక విలువల కారణంగా ఇది ఆరోగ్యానికి చాలా ఉపయోగ పడుతుంది. కరివేపాకులను జుట్టు, చర్మ వ్యాధులను నయం చేయడానికి కూడా ఉపయోగిస్తారు.
కరివేపాకులో భాస్వరం, ఇనుము, కాల్షియం, విటమిన్ సి, ఎ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇంతకు ముందు సౌత్ ఇండియాలో కరివేపాకు ఎక్కువగా వాడేవారు. ఇప్పుడు ఉత్తర భారతదేశంలోని ప్రజలు కూడా ఆహారంలో ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ప్రస్తుతం కరివేపాకు డయాబెటిక్ రోగుల చక్కెరను నియంత్రించడంతో పాటు అనేక వ్యాధులలో ఉపయోగకరంగా ఉంది. కరివేపాకు వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి ఈ రోజు తెలుసుకుందాం.
రక్తహీనత తగ్గిస్తుంది
రక్తహీనత (హీమోగ్లోబిన్ లోపం) సమస్య మహిళల్లో తరచుగా కనిపిస్తుంది. కరివేపాకులో ఐరన్, విటమిన్ సి ఎక్కువగా ఉంటాయి. ఇది రక్తహీనతకు సహాయపడటమే కాకుండా రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది. తద్వారా మళ్లీ మళ్లీ అనారోగ్యానికి గురికాకుండా నివారించవచ్చు.
జీర్ణక్రియ వేగవంతం
కరివేపాకును ప్రతిరోజూ తీసుకుంటే జీర్ణక్రియ మెరుగుపడుతుంది. ఇది గ్యాస్, మలబద్ధకం, తిమ్మిరి వంటి కడుపు సంబంధిత సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.
మార్నింగ్ సిక్ నెస్ నుంచి ఉపశమనం
చాలా సార్లు వికారం, వాంతులు వంటి సమస్యలు ఉదయాన్నే మొదలవుతాయి. కరివేపాకు మార్నింగ్ సిక్నెస్ నుంచి ఉపశమనం కలిగిస్తుంది. ఇది ఉబ్బరం, గ్యాస్ వంటి సమస్యలను నివారించే లక్షణాలను కలిగి ఉంటుంది.
బరువును అదుపులో ఉంచుతుంది
కరివేపాకు తినడం వల్ల బ్లడ్ షుగర్ అదుపులో ఉంటుంది. అంతే కాకుండా సరైన బరువును మెయింటైన్ చేయడంలో సహాయపడుతుంది. ఊబకాయం పెరగడం అనేక వ్యాధులకు కారణం అవుతుంది. అందువల్ల బరువు తగ్గాలంటే ఆహారంలో కరివేపాకులను చేర్చుకోవాలి.
కరివేపాకు ఎలా తినాలి..?
ఆరోగ్య సమస్యల నుంచి బయటపడటానికి, కరివేపాకును పచ్చిగా నమిలి తినడం ఉత్తమ మార్గం. ఆహారంలో చేర్చుకోవడంతో పాటు ప్రతిరోజూ ఉదయం ఐదు నుంచి ఆరు కరివేపాకులను నమిలి తింటే చాలా మంచిది.