Cracked Heels: చలికాలంలో మడమల పగుళ్లు ఇబ్బంది పెడతాయి.. ఈ పద్ధతిలో మృదువుగా మార్చుకోండి..!

Cracked Heels: చలికాలం వచ్చిందంటే చాలు చాలా ఆరోగ్య సమస్యలు మొదలవుతాయి. అందులో ఒకటి మడమల పగుళ్ల సమస్య. దీనివల్ల రాత్రిపూట సరిగ్గా నిద్రపోలేరు.

Update: 2023-12-17 14:30 GMT

Cracked Heels: చలికాలంలో మడమల పగుళ్లు ఇబ్బంది పెడతాయి.. ఈ పద్ధతిలో మృదువుగా మార్చుకోండి..!

Cracked Heels: చలికాలం వచ్చిందంటే చాలు చాలా ఆరోగ్య సమస్యలు మొదలవుతాయి. అందులో ఒకటి మడమల పగుళ్ల సమస్య. దీనివల్ల రాత్రిపూట సరిగ్గా నిద్రపోలేరు. పాదాల రంగు కూడా మారుతుంది. మరికొందరు బయటికి కూడా రాలేకపోతారు. మీరు పగుళ్ల సమస్యను ఎదుర్కొంటుంటే కొన్ని చిట్కాలను పాటించాలి. వీటివల్ల పాదాలు మృదువుగా, అందంగా మార్చుకోవచ్చు. వాటి గురించి ఈ రోజు తెలుసుకుందాం.

చలికాలంలో పాదాలను క్లీన్‌గా ఉంచుకోవాలి. స్నానం చేసేటప్పుడు లేదా ఖాళీ సమయం దొరికినప్పుడు పాదాలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. పగిలిన మడమలపై ఇంట్లోలభించే నూనె లాంటి కొన్ని పదార్థాలను ఉపయోగించి నయం చేసుకోవచ్చు. రాత్రి పడుకునే ముందు కలబంద, గ్లిజరిన్ రాసి కొద్దిసేపు మర్దన చేయాలి. దీనివల్ల చాలా ఉపశమనం లభిస్తుంది. నిద్ర కూడా తొందరగా పడుతుంది. ప్రతిరోజు ఇలాచేస్తే పగుళ్లు మటుమాయం అవుతాయి.

పగిలిన మడమల మీద తేనెను అప్లై చేయవచ్చు. ఇది పాదాలను మృదువుగా, అందంగా మారుస్తుంది. మీరు ప్రతి రాత్రి పాదాలకు తేనెను అప్లై చేసి కొద్దిసేపు మర్దన చేయాలి. కొబ్బరి నూనె శరీరానికి, ముఖానికి చాలా ఉపయోగపడుతుంది. పగిలిన మడమలపై అప్లై చేసి మర్దన చేయాలి. దీనివల్ల చాలా ఉపశమనం లభిస్తుంది. మడమల పగుళ్లకు బియ్యం పిండి చాలా మేలు చేస్తుంది. దీనితో బాగా స్క్రబ్ చేయాలి. ప్రతిరోజు చేస్తుంటే వారం రోజుల్లో పగుళ్ల మాయమవుతాయి.

Tags:    

Similar News