Health Tips: దగ్గు చాలా రోజులుగా వేధిస్తుందా.. పొరపాటున కూడా ఇవి తినకండి..!

Health Tips: దగ్గు చాలా రోజులుగా వేధిస్తుందా.. పొరపాటున కూడా ఇవి తినకండి..!

Update: 2022-11-03 08:15 GMT

Health Tips: దగ్గు చాలా రోజులుగా వేధిస్తుందా.. పొరపాటున కూడా ఇవి తినకండి..!

Health Tips: వాతావరణంలో మార్పులు ఏర్పడినప్పుడు చాలామందికి రోగనిరోధక శక్తి తగ్గి జలుబు, దగ్గుకి గురవుతారు. అంతేకాదు గొంతు నొప్పి, బొంగురుపోవడం, శ్వాస ఆడకపోవడం వంటి సమస్యలు కూడా ఉంటాయి. మారుతున్న సీజన్‌లో ఇన్‌ఫెక్షన్ రిస్క్ గణనీయంగా పెరుగుతుంది. దీని వల్ల కఫం వస్తుంది. సాధారణంగా దగ్గు ఒక వారంలో తగ్గిపోతుంది. అయితే చాలా వారాలుగా దగ్గుతో ఇబ్బంది పడుతుంటే అప్రమత్తంగా ఉండాలి. కొన్ని రకాల ఆహారాలకి దూరంగా ఉండాలి. లేదంటే దగ్గు తీవ్రత మరింత పెరుగుతుంది. వాటి గురించి తెలుసుకుందాం.

1. పెరుగు

పెరుగు చాలా ఆరోగ్యకరమైన ఆహారం. దీనిని తీసుకోవడం వల్ల జీర్ణక్రియ సజావుగా ఉంటుంది. మలబద్ధకం లేదా గ్యాస్ సమస్య ఉండదు. కానీ దగ్గు సమస్య ఉన్నప్పుడు దీనికి దూరంగా ఉండాలి. ఇలాంటి సమయంలో పెరుగు తింటే కఫం పెరుగుతుంది. ఎందుకంటే పెరుగు చల్లటి గుణాన్ని కలిగి ఉంటుంది.

2. ఐస్ క్రీం

ఐస్ క్రీం రుచి అందరికి నచ్చుతుంది. కొంతమంది దగ్గు సమస్య ఉన్నప్పుడు కూడా ఐస్‌ క్రీం తింటారు. దీని వల్ల దగ్గు మరింత పెరుగుతుంది. ఇలాంటి సమయంలో ఐస్‌ క్రీంని నివారించాలి.

3. శీతల పానీయాలు

ఈ రోజుల్లో శీతల పానీయాలు తాగడం ఒక ట్రెండ్‌గా మారింది. కానీ దగ్గు సమస్య ఉన్నప్పుడు శీతల పానీయాలు తాగకూడదు. దీనివల్ల పరిస్థితి ప్రమాదకరంగా మారుతుంది.

4. డీప్ ఫ్రైడ్ ఫుడ్స్

డీప్ ఫ్రైడ్ ఫుడ్స్ దగ్గు పరిస్థితిని మరింత దిగజార్చుతాయి. వెన్న, పందికొవ్వు, ఒమేగా-6 కొవ్వు ఆమ్లాలు శ్లేష్మం ఉత్పత్తి అవడానికి కారణం అవుతాయి. కాబట్టి శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచే ఆహారాలని మాత్రమే తీసుకోవాలి.

Tags:    

Similar News