Benefits Of Brass Utensils : ఇత్తడి పాత్రల్లో ఆహారం వండటం..ఆరోగ్యానికి మేలు చేస్తుందా?

Cooking In Brass Utensils : చాలా మంది ఇళ్లలో కిచెన్ లోకి వెళ్లగానే స్టీల్ పాత్రలు దర్శనమిస్తుంటాయి. కానీ పూర్వకాలంలో ఎక్కువగా రాగి, ఇత్తడి, మట్టి కుండలను వంట చేసేందుకు వాడేవాళ్లు. కానీ నేటి కాలంలో కిచెన్ ను స్టీల్, ప్లాస్టిక్ ఆక్రమించేసింది. స్టిల్, ప్లాస్టిక్ చూడటానికి అందంగా కనిపిస్తాయి. కానీ ఆరోగ్యానికి మాత్రం లాభాల కంటే నష్టాలే ఎక్కువగా ఉంటాయి. మీరు ఎప్పుడై ఇత్తడి పాత్రల్లో వంట చేశారా? ఈ మధ్య కాలంలో చాలా మంది ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహిస్తున్నారు. స్టీల్ కంటే ఇత్తడి, రాగి పాత్రలను ఉపయోగిస్తున్నారు. అయితే ఇత్తడి పాత్రల్లో వంట చేస్తే ఆరోగ్యానికి ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం.

Update: 2024-08-10 06:54 GMT

Benefits Of Brass Utensils : ఇత్తడి పాత్రల్లో ఆహారం వండటం..ఆరోగ్యానికి మేలు చేస్తుందా?

 Cooking In Brass Utensils : కోవిడ్ కాలం నుంచి ప్రజల్లో ఆరోగ్యం పల్ల అవగాహన చాలా పెరిగింది. ఆహారం, ఆరోగ్యం పట్ల చాలా శ్రద్ధ వహిస్తున్నారు. కొన్ని అలవాట్లను మార్చుకుని..మంచి అలవాట్ల వైపు మళ్లుతున్నారు. అయితే ఈ మధ్య కాలంలో చాలా మంది వంట ఎలాంటి పాత్రల్లో వండుతే మంచిదనే విషయాన్ని తెలుసుకుంటున్నారు. పూర్వకాలంలో కట్టెల పొయ్యిల మీద మట్టికుండల్లో వండిన ఆహారం తిని ఎక్కువ రోజులు ఆరోగ్యంగా జీవించే వారు. కానీ ఇప్పుడు ప్లాస్టిక్, స్టిల్ మన వంటగది ఆక్రమించేశాయి. స్టీల్, ప్లాస్టిక్ చూడటానికి అందంగా..కిచెన్ తళతళ మెరిసేలాచేస్తాయి. కానీ వాటిలోని రసాయనాలు అనారోగ్యానికి గురి చేస్తాయన్న అవగాహన చాలా మందిలో పెరిగిపోయింది. అందుకే ఇప్పుడు ప్రత్యామ్నాల వైపు మొగ్గుచూపుతున్నారు.

కొన్నిలోహాలతో తయారు చేసిన పాత్రల్లో వండిన ఆహారం తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేల చేస్తుందని నిపుణులు సైతం చెబుతున్నారు. అలాంటి వాటిల్లో ఇత్తడి ఒకటంటున్నారు. ఇత్తడి పాత్రలపై సూక్ష్మజీవులు ఎక్కువ సేపు జీవించలేవు. అలాగే ఆహార పదార్థాలు త్వరగా వేడి తగ్గకుండా ఉంటాయి. ఈ పాత్రల్లో చాట్ పెట్టుకుని తాగడం వల్ల ఆహార పదార్థాలు వండుకుని తినడం వల్ల ఎన్నో పోషకాలు లభిస్తాయని చెబుతున్నారు. ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయో ఇప్పుడు చూద్దాం.

ఆహారం రుచి పెరుగుతుంది:

వంట చేసేందుకు ఇత్తడి పాత్రలను వాడటం వల్ల వాటి రుచి పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. వీటిలో వంట చేసేటప్పుడు ఆపాత్రల నుంచి సహజ నూనెలు విడుదలవుతాయి. ఇవి సహజంగా ఆహారం రుచిని పెంచడమే కాదు ఆరోగ్యానికి కూడా మేలు చేస్తాయి.

జీర్ణక్రియకు మేలు:

చాయ్ తోపాటు ఇతర వంటకాలు ఇత్తడి గిన్నెల్లో చేయడం వల్ల జీర్ణ ఆరోగ్యానికి మేలు చేస్తుందని ప్రముఖ న్యూట్రిషనిస్ట్ లు చెబుతున్నారు. ఇందుకంటే ఇత్తడి పాత్రల్లో వంటచేసేటప్పుడు వాటి నుంచి విడుదలైన పోషకాలు మనం తినే ఆహారంతోపాటు నేరుగా శరీరంలోకి ప్రవేశిస్తాయని అంటున్నారు. ఆహారం బాగా జీర్ణమై మలబద్ధకం, గ్యాస్, అజీర్తి వంటి సమస్యలను తగ్గిస్తాయని వారు చెబుతున్నారు.

రోగనిరోధకశక్తి పెరుగుతుంది:

ఇత్తడిపాత్రల్లో వాటర్ నింపి పెట్టుకుంటే ఆరోగ్యానికి మేలు చేస్తుందని వైద్యులు చెబుతున్నారు. రాత్రంతా ఇత్తడి పాత్రలో ఉంచిన నీటి తాగితే శరీరంలో రోగనిరోధకశక్తి పెరుగుతుందని చెబుతున్నారు. ఈ పాత్రలలో ఆహారాలను వండుకుని తినడం వల్ల ఇమ్యూనిటీ పెరుగుతుందని చెబుతున్నారు.

చర్మ ఆరోగ్యానికి :

ఇక ఇత్తడి చర్మానికి మేలు చేస్తుంది. రోజు చాయ్ తాగే అలవాటు ఉన్నవాళ్లు ఈ పాత్రలను వాడటం వల్ల ఇతర వంటకాల కోసం ఇత్తడి పాత్రలను వాడితే చర్మానికి కూడా మేలు చేస్తుంది. చర్మ సమస్యలు, మొటిమల నుంచి ఉపశమనం లభిస్తుంది.

ఈ వంటకాలు వండకూడదు:

మీరు ఇత్తడి పాత్రల్లో వంట చేసేటప్పుడు ఈ విషయాలు తప్పకుండా గుర్తుంచుకోవాలి. ఇత్తడిపాత్రల్లో నిమ్మకాయ, టమోటా వంటి సి విటమిన్ ఉండే ఆహారాలు ఎప్పుడూ వండకూడదు. వాటిని ఈ పాత్రలలో వండితే శరీరానికి హాని చేస్తుంది. 

Tags:    

Similar News