Chicken Breast or leg pieces: చికెన్ బ్రెస్ట్ వర్సెస్ లెగ్ పీసెస్..రెండింటిలో ఏది తింటే ఆరోగ్యానికి మంచిది
Chicken Breast or leg pieces: చికెన్ అంటే ఇష్టపడని వారుండరు. చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు ఎంతో ఇష్టంగా తింటారు. ప్రతిరోజూ చికెన్ తినేవారు కూడా ఎంతో మంది ఉంటారు. అయితే చాలా మందికి లెగ్ పీస్, బ్రెస్ట్ పీస్ అంటే ఇష్టం ఉంటుంది. మరి మన ఆరోగ్యానికి చికెన్ బ్రెస్ట్ లేదా లెగ్ పీస్ ఈ రెండింటిలో ఏది మంచిది. పూర్తి వివరాలు తెలుసుకుందాం.
Chicken Breast or leg pieces: చికెన్ అంటే అందరికీ ఇష్టం. ఎంతో ఇష్టంగా లాగించేస్తుంటారు. చికెన్ లో బోలెడు వెరైటీలు ఉంటాయి. చికెన్ మంచురియా, చికెన్ ఫ్రై, చికెన్ బిర్యానీ, చికెన్ ప్రై, చికెన్ 65, ఇలా ఎన్నో రకాలు ఉంటాయి. చిన్నపిల్లలు అయితే చికెన్ అంటే చాలు ఇష్టంగా తింటారు. ఎందుకంటే చికెన్ లో ప్రొటీన్ ఎక్కువగా ఉంటుంది. మటన్ కంటే ఆరోగ్యానికి చికెన్ మంచిదని వైద్యులు కూడా చెబుతుంటారు. తేలికగా జీర్ణం అవుతుంది. అయితే కొంతమంది చికెన్ లో అన్ని భాగాలు తింటారు. కొంతమంది మాత్రం సెలక్టెడ్ గా తింటుంటారు. చిన్నపిల్లలు అయితే చికెన్ వెంగ్స్ ను లాగించేస్తుంటారు. మరి చికెన్ బ్రెస్ట్ వర్సెస్ చికెల్ లెగ్ పీస్ ఈ రెండింటిలో ఏది ఆరోగ్యానికి మంచిది. ఏది తింటే ఎక్కువ ప్రయోజనాలను పొందగలమో IEXPLODEలో పోషకాహార నిపుణుడు విపుల్ శర్మ ఏం చెబుతున్నారో తెలుసుకుందాం.
లెగ్ పీస్:
చికెన్ లెగ్ పీస్ రుచిగా ఉంటుంది. ఇందులో ఎక్కువగా కొవ్వు ఉంటుంది. బ్రెస్ట్ పార్ట్ కంటే ఎక్కువ లెక్ పీస్ లో కొవ్వు ఎక్కువగా ఉంటుంది. లెగ్ మీట్‌లో ఎక్కువ కొవ్వు,కణజాలం ఉంటుంది కాబట్టి రుచిగా ఉంటుంది. లెగ్ పీస్‌లో డార్క్ మీట్ ఉంటుంది. అంతేకాదు ఇందులో మయోగ్లోబిన్ పుష్కలంగా ఉంటుంది. ఇది కండరాలలో ఆక్సిజన్‌ను నిల్వ చేసే ప్రోటీన్. ఇది బ్రెస్ట్ మాంసంతో పోలిస్తే ముదురు రంగు, కొద్దిగా భిన్నమైన రుచిని ఇస్తుంది.లెగ్ పీస్ మాంసంలో ఐరన్, జింక్ , విటమిన్లు అవసరమైన పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇది కొవ్వు పదార్థం కాబట్టి కేలరీలు ఎక్కువగా ఉంటాయి. ఒక చికెన్ లెగ్ పీస్ (44 గ్రాములు) 12.4 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. ఇది 100 గ్రాములకు 28.3 గ్రా ప్రోటీన్‌కి సమానం.
బ్రెస్ట్ పీస్:
చికెన్ బ్రెస్ట్ పీస్ దాని లీన్, వైట్ మాంసాన్ని చాలా మంది ఇష్టపడుతారు. లెగ్ పీస్‌తో పోలిస్తే ఇది కొవ్వులో తక్కువగా ఉండంతోపాటు అనేక హెల్త్ బెనిపిట్స్ ఇందులో ఉన్నాయి. అంతేకాదు ఇందులో ప్రొటీన్ పుష్కలంగా ఉంటుంది. ఫిట్‌నెస్ ఇష్టపడేవారు బరువు తగ్గాలని ప్లాన్ చేసేవారు ఎక్కువగా ఈ పార్ట్ తింటారు. లెగ్ పీస్ తో పోల్చితే చికెన్ బ్రెస్ట్ కొవ్వు తక్కువగా ఉంటుంది. ఇందులో ఉండే ప్రొటీన్ శరీర పనితీరుకు మేలు చేస్తుంది. పోషకాహార నిపుణుల ప్రకారం వండిన స్కిన్ లెస్ చికెన్ బ్రెస్ట్ లో 54గ్రాములు ప్రొటీన్ ఉంటుంది. వంద గ్రాములకు 31 గ్రాములకు ప్రొటీన్ కు సమానం.
ఏది ఆరోగ్యకరమైనది?
లెగ్ పీస్ లేదా బ్రెస్ట్ పీస్ ఆరోగ్యకరమైనదా అనే ప్రశ్న ప్రజల కోరికపై ఉంటుంది. బరువు తగ్గాలనుకునేవారు బ్రెస్ట్ చికెన్ తినడం మంచిది. ఫ్లేవర్, వెరైటీగా తినాలనుకునేవారు లెగ్ పీస్ తినడం మంచిది. బ్రెస్ట్ వర్సెస్ లెగ్ పీస్ కంటే బ్రెస్ట్ మాంసమే ఆరోగ్యానికి మంచిదని నిపుణులు చెబుతున్నారు.