Check Water Bottle: వాటర్ బాటిల్‌లోని నీరు స్వచ్ఛమైందా కాదా.. ఈ విధంగా చెక్ చేయండి..!
Check Water Bottle: ఈ రోజుల్లో బస్టాండ్‌లో, రైల్వేస్టేషన్‌లో ఎక్కడ చూసినా ప్యాకేజ్డ్ వాటర్ బాటిల్స్ దొరుకుతున్నాయి.
Check Water Bottle: ఈ రోజుల్లో బస్టాండ్‌లో, రైల్వేస్టేషన్‌లో ఎక్కడ చూసినా ప్యాకేజ్డ్ వాటర్ బాటిల్స్ దొరుకుతున్నాయి. ప్రజలు వాటికి డబ్బులు చెల్లించి తీసుకొని తమ దాహాన్ని తీర్చుకుంటున్నారు. కానీ అందులో ఉన్నవి స్వచ్ఛమైన నీరా కాదా అనే విషయం చాలామందికి తెలియదు. నేటి రోజుల్లో నీళ్ల వ్యాపారం బాగా పెరిగిపోయింది. బిస్లరీ టు కిన్లీ వంటి కంపెనీలు దేశంలో ఈ బిజినెస్‌లో ముందు వరుసలో ఉన్నాయి. అయితే ఈ రంగంలో రిజిస్టర్డ్ కంపెనీలే కాకుండా నకిలీ కంపెనీలు కూడా ఉన్నాయి. వాటిని గుర్తించపోతే అనారోగ్యానికి గురికావాల్సి ఉంటుంది.
సీసాలపై ముద్రించిన ISI మార్క్ కోడ్ ద్వారా మీరు నిజమైన, నకిలీ నీటిని గుర్తించవచ్చు. రూ.20 విలువైన బాటిల్ కొనుగోలు చేస్తే దానిపై ముద్రించిన ఐఎస్-14543 కోడ్ ద్వారా నీరు సురక్షితమా కాదా తెలుసుకోవచ్చు. వాటర్ బాటిల్ కవర్ చూస్టే ఈ టెక్నాలజీ తెలియకపోవచ్చు కానీ బాటిల్ లో తయారు చేసిన వస్తువు సరైనదా కాదా అని చెప్పొచ్చు.
ఎవరైనా మోసం చేయవచ్చు
ఇలాంటి కోడ్‌లను ఉపయోగించడం ద్వారా చాలా కంపెనీలు మార్కెట్లో మోసం చేస్తున్నాయి. మీరు BIS కేర్ అనే మొబైల్ యాప్‌ని ఉపయోగించడం వల్ల ఈ విషయాన్ని సులభంగా గుర్తించవచ్చు. ఈ యాప్ ద్వారా బాటిల్ వాటర్ ఎక్కడ ప్యాక్ చేశారు. అందులో ఎలాంటి మినరల్స్ వాడుతున్నారు. వాటి నాణ్యత వివరాలను తెలుసుకోవచ్చు.
ఇలా చెక్ చేయండి
మీరు BIS కేర్ అప్లికేషన్‌ను ఓపెన్ చేసినప్పుడు కొన్ని గుర్తులు కనిపిస్తాయి. వీటిలో ఒకటి ISI, ధృవీకరించబడిన లైసెన్స్ వివరాలు ఉంటాయి. వాటిపై క్లిక్ చేయడం ద్వారా మీరు CM/L-10 అనే 10 అంకెల కోడ్‌ని పొందుతారు. కొనుగోలు చేసిన బాటిల్ ప్యాకేజింగ్ నుంచి మీరు ఈ కోడ్‌ను కాపీ చేయాలి. ఆ తర్వాత మీరు కొన్న బాటిల్‌లో నీరు నిజమైనదా కాదా అనే విషయం గుర్తించవచ్చు.