Cashew Milk: జీడిపప్పు పాలతో నిద్రలేమి దూరం.. ఇంకా ఈ ప్రయోజనాలు..!
Cashew Milk: కొంతమంది జీడిపప్పు తినడం వల్ల శరీరంలో కొవ్వు పేరుకుపోతుందని భావిస్తారు. కానీ ఇందులో నిజం లేదు.
Cashew Milk: కొంతమంది జీడిపప్పు తినడం వల్ల శరీరంలో కొవ్వు పేరుకుపోతుందని భావిస్తారు. కానీ ఇందులో నిజం లేదు. వాస్తవానికి జీడిపప్పులో కొవ్వు పదార్థాలు ఉండవు. కేవలం ప్రొటీన్, హెల్దీ ఫ్యాట్స్, యాంటీ ఆక్సిడెంట్లు మాత్రమే ఉంటాయి. ఉద్యోగులు రోజంతా పని చేసి చేసి బాడీ, మైండ్ రెండూ అలసిపోతాయి. కొన్నిసార్లు ఫంక్షన్ ల కారణంగా నైట్ నిద్ర ఆలస్యం అవుతుంది. ఇలాంటి సమయంలో జీడిపప్పు పాలు తాగితే మైండ్ రిలాక్స్ అయి త్వరగా నిద్రపడుతుంది. జీడిపప్పు పాల గురించి మరిన్ని విషయలు తెలుసుకుందాం.
జీడిపప్పులో మోనోసాచ్యురేటెడ్ ఫ్యాటీ యాసిడ్ ఎక్కువగా ఉంటుంది. ఇది కరోనరీ హార్ట్ డిసీజెస్, బ్లడ్ కొలెస్ట్రాల్ లెవల్ ని తగ్గించడానికి ఉపయోగపడుతుంది. ఇవి బోన్ హెల్త్ కు కావాల్సిన మినరల్స్ ని అందిస్తాయి. బ్రెయిన్‌కు మంచి ఫుడ్ ఇవే. అందుకే వీటిని "నాచురల్ డిప్రెశాంట్స్" అంటారు. జీడిపప్పు పాలు తాగితే ఈ లాభాలన్నీ శరీరానికి అందుతాయి. జీడిపప్పుని వంటల్లో కూడా వాడుతారు. మధ్యాహ్నం ఏవైనా తినాలనిపిస్తే కొంతమంది వీటినే తింటారు. దీనివల్ల ఆరోగ్యానికి చాలామంచిదని న్యూటిషనిట్లు చెబుతున్నారు.
జీడిపప్పు పాల తయారీ
పాలలో కొన్ని జీడిపప్పులు వేసి నాలుగైదు గంటలు నానబెట్టాలి. తర్వాత వాటిని గ్రైండ్ చేసి పేస్ట్ చేసుకోవాలి. దానిని గిన్నెలోకి తీసుకొని అందులో కొన్ని పాలు పోయాలి. ఆ పాల మిశ్రమాన్ని కాసేపు మరిగించి తగినంత చక్కెర వేసి వేడిగా తాగాలి. దీనివల్ల వెంటనే నిద్ర కమ్ముకొస్తుంది. ఉదయం పూట ఎనర్జిటిక్‌గా ఉంటారు. శరీర బలహీనత తొలగిపోతుంది. రోజు మొత్తం చురుకుగా ఉంటారు.