Cardamom: బీపీ పేషెంట్లకి యాలకులు దివ్యౌషధం.. ఈ ఆరోగ్య సమస్యలన్ని దూరం..!

Cardamom: యాలకులు ఒక మసాలా దినుసు. ఇది కొంచెం ఘాటుగా రుచిలో తీపిగా ఉంటుంది.

Update: 2022-11-29 15:30 GMT

Cardamom: బీపీ పేషెంట్లకి యాలకులు దివ్యౌషధం.. ఈ ఆరోగ్య సమస్యలన్ని దూరం..!

Cardamom: యాలకులు ఒక మసాలా దినుసు. ఇది కొంచెం ఘాటుగా రుచిలో తీపిగా ఉంటుంది. యాలకులని ఎక్కువగా వంటలలో మసాలగా ఉపయోగిస్తారు. అయితే యాలకులు అనేక వ్యాధులని నివారిస్తుంది. వీటిని రోజూ తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి బలపడుతుంది. ఇందులో విటమిన్-సి, మినరల్స్, ఐరన్, కాల్షియం వంటి పోషకాలు ఉంటాయి. యాలకులు తినడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి ఈ రోజు తెలుసుకుందాం.

రక్తపోటును తగ్గిస్తుంది..

యాలకులు తీసుకోవడం వల్ల రక్తపోటు తగ్గుతుంది. రోజూ 3 గ్రాముల యాలకులు తీసుకుంటే రక్తపోటు అదుపులో ఉంటుంది.

జీర్ణక్రియ సవ్యంగా జరుగుతుంది

యాలకులు తినడం వల్ల జీర్ణక్రియ సవ్యంగా జరుగుతుంది. దీంతో పాటు అల్సర్లను నయం చేస్తుంది. యాలకుల నీటిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల జీర్ణ సమస్యలు దూరమవుతాయి. మలబద్ధకం వంటి సమస్య ఉంటే యాలకుల నీటిని తీసుకోవాలి.

మంటను తగ్గిస్తుంది

యాలకులు శరీరంలోని కణాలలో మంటను కలిగించే యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటాయి. యాలకుల్లో ఉండే యాంటీఆక్సిడెంట్లు కణాలను నాశనం చేయకుండా కాపాడతాయి.

చక్కెరను నియంత్రిస్తుంది

రోజూ యాలకులు తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయి అదుపులో ఉంటుంది. దీని కోసం యాలకుల పొడిని ఉపయోగించవచ్చు.

క్యాన్సర్ నివారిస్తుంది..

యాలకులలో ఉండే యాంటీఆక్సిడెంట్లు క్యాన్సర్‌తో పోరాడడంలో ఉపయోగపడుతాయి. అయితే ప్రతిరోజూ చిన్న యాలకులను తీసుకుంటే అవి క్యాన్సర్ కణాలను చంపడంలో సహాయపడతాయి.

Tags:    

Similar News