Blood Donation Benefits: రక్తదానం మంచిదే.. శరీరానికి ఈ ప్రయోజనాలు లభిస్తాయి..!
Blood Donation Benefits: రక్తదానం చేయడం వల్ల అటు సమాజానికి ఇటు శరీరానికి ప్రయోజనా లు లభిస్తాయి.
Blood Donation Benefits: రక్తదానం చేయడం వల్ల అటు సమాజానికి ఇటు శరీరానికి ప్రయోజనా లు లభిస్తాయి. చాలామంది రక్తం దానం చేయడం వల్ల వీక్ అవుతామని భయపడుతూ ఉంటారు. కానీ ఇది వట్టి అపోహ మాత్రమే. రక్తం దానం చేయడం వల్ల శరీరానికి ఎటువంటి హాని ఉండదు. పైగా అతడికి చాలా ప్రయోజనాలు కలుగుతాయి. దేశంలో సరైన సమయంలో బ్లడ్ అందక చాలామంది ప్రాణాలు కోల్పోతుంటారు. అలాంటి వారికి రక్తదానం చేస్తే ఒక నిండు ప్రాణం కాపాడినవారం అవుతాం. రక్తదానం అనేది ప్రతి ఒక్కరు పాటించాల్సిన సామాజిక బాధ్యత.
దేశం జనాభాలో 37 శాతం మంది మాత్రమే రక్తదానం చేయడానికి అర్హులు. ఏటా రక్తదానం 10 శాతం కంటే తక్కువ మంది మాత్రమే రక్తదానం చేస్తారు. రక్తదానం తలసేమియా, సికిల్ సెల్ వ్యాధి వంటి జన్యు రక్త రుగ్మతలు ఉన్న వ్యక్తులను కాపాడుతుంది. క్రమం తప్పకుండా రక్తదానం చేయడం వల్ల ఐరన్ స్థాయిలు అదుపులో ఉంటాయి. రక్తంలో ఎక్కువ ఐరన్ పేరుకుపోవడం వల్ల రక్త ధమనులను అడ్డుకుంటుంది. దీనివల్ల గుండెపోటు ప్రమాదం పొంచి ఉంటుంది. హిమోక్రోమాటోసిస్ అనే వ్యాధికి కారణమవుతుంది.
రక్తదానం ద్వారా అదనపు ఐరన్ నిల్వను తగ్గించవచ్చు. తద్వారా గుండెపోటు ప్రమాదాన్ని దూరం చేసుకోవచ్చు. రక్తంలో ఐరన్ అధికంగా చేరడాన్ని తగ్గించడానికి, క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడానికి రక్తాన్ని క్రమం తప్పకుండా దానం చేయాలి. రక్తదానం చేయడం వల్ల మొత్తం వ్యవస్థను పునరుద్ధరించవచ్చు. ఒక వ్యక్తి డయాలసిస్ లేదా స్వచ్ఛంద రక్తదానం చేయించుకున్నప్పుడు ఎర్ర రక్త కణాలు కొత్తగా ఏర్పడుతాయి. కొత్త రక్తం ప్లాస్మా ఏర్పడటం వల్ల ల్యూకోసైట్లు వృద్ధి చెందుతాయి. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతాయని గుర్తుంచుకోండి.