Health Tips: సిరలలో రక్తం గడ్డకడితే చాలా డేంజర్.. ఇలా సరిచేసుకోండి..!
* ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోకపోతే వ్యాధి మరింత పెరిగే అవకాశం ఉంది.
Health Tips: చాలా మందికి రక్తనాళాలలో రక్తం గడ్డకడుతుంది. దీని కారణంగా సిరలు ఉబ్బుతాయి. ఈ సమస్య కాళ్లలో ఎక్కువగా కనిపిస్తుంది. ఈ సమస్య చాలా తీవ్రమైనది. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోకపోతే వ్యాధి మరింత పెరిగే అవకాశం ఉంది. రక్తం గడ్డకట్టడం వల్ల రక్త ప్రసరణ సరిగా జరగదు. దీని కారణంగా గుండెపై ఒత్తిడి పెరుగుతుంది. రక్తం గడ్డకట్టడం వల్ల ఊబకాయం సమస్య ఏర్పడుతుంది. ప్రారంభంలో ఈ సమస్యను కొన్ని ఇంటి నివారణల ద్వారా సరిదిద్దవచ్చు. వాటి గురించి తెలుసుకుందాం.
పసుపు:
పసుపులో ఎన్నో ఔషధ గుణాలు దాగి ఉన్నాయి. ఇది శరీరానికి సంబంధించిన అనేక సమస్యలను దూరం చేస్తుంది. దీనిలో కర్కుమిన్ అనే రసాయన పదార్థం ఉంటుంది. ఇది రక్తం పలుచబడటానికి సహాయపడుతుంది. పసుపును ఉపయోగించడం వల్ల రక్తం పలచన అవుతుంది.
తులసి:
తులసి ఔషధ గుణాలతో నిండి ఉంటుంది. ఇది రక్తం గడ్డకట్టే సమస్యను నివారిస్తుంది. తులసిలో ఉండే గుణాలు రక్తాన్ని పలచబరుస్తాయి. దీని వాడకం వల్ల రక్త ప్రసరణ బాగానే ఉంటుంది. తులసి టీ లేదా డికాక్షన్ తాగవచ్చు.
అల్లం:
అల్లంలో ఉండే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు రక్తం పలుచబడటానికి సహాయపడతాయి. అల్లంలో సాలిసైలేట్ అనే యాసిడ్ ఉంటుంది. ఇది రక్తాన్ని పలచగా చేస్తుంది. మీకు రక్తం గడ్డకట్టడంలో సమస్యలు ఉంటే అల్లంను ఆహారంలో భాగంగా చేసుకోవచ్చు.
ఎర్ర మిరపకాయ:
ఎర్ర మిరపకాయలలో సాలిసిలేట్లు ఉంటాయి. ఇవి రక్తాన్ని పలుచగా చేస్తాయి. కాయెన్ పెప్పర్ రక్తం గడ్డకట్టడాన్ని నివారించడంలో ప్రభావవంతంగా పనిచేస్తుంది.