Health Tips: నల్లపసుపులో అద్భుత ఔషధ గుణాలు.. ఈ వ్యాధుల నుంచి ఉపశమనం..
Health Tips: నల్లపసుపులో అద్భుత ఔషధ గుణాలు.. ఈ వ్యాధుల నుంచి ఉపశమనం..
Health Tips: పసుపుని సాధారణంగా భారతీయ వంటలలో ఉపయోగిస్తారు. అయితే పసుపులో నల్లటి పసుపు కూడా ఉంటుంది. ఇలాంటి పసుపులో ఔషధ గుణాలు మెండుగా ఉంటాయి. ఈ పసుపును మధ్యప్రదేశ్, ఈశాన్య రాష్ట్రాలలో పండిస్తారు. దీని శాస్త్రీయ నామం కర్కుమా సీసియా. నల్ల పసుపు ద్వారా చాలా వ్యాధులని నయం చేయవచ్చు. నల్ల పసుపు ప్రయోజనాల గురించి తెలుసుకుందాం.
ఆరోగ్యకరమైన ఊపిరితిత్తుల కోసం
నల్ల పసుపులో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. దీని ఉపయోగం జలుబు, దగ్గు, శ్వాసకోశ సమస్యల నుంచి దూరంగా ఉంచడంలో సహాయపడుతుంది. మీరు పసుపు స్థానంలో నల్ల పసుపును ఉపయోగించవచ్చు.
మైగ్రేన్‌లో ఉపశమనం
మైగ్రేన్ నొప్పి భరించలేనిది. ఈ సమయంలో తల భాగంలో తీవ్రమైన నొప్పి ఉంటుంది. దీని కోసం మీరు నల్ల పసుపును గ్రైండ్ చేసి పేస్టులా తయారు చేసి నుదుటిపై రుద్దాలి. ఇది మైగ్రేన్ నుంచి ఉపశమనం కలిగించడంలో సహాయపడుతుంది.
క్యాన్సర్ దూరం
నల్ల పసుపులో క్యాన్సర్ నిరోధక లక్షణాలు అధికంగా ఉంటాయి. శరీరంలో క్యాన్సర్ కణాలు పెరగకుండా చేస్తుంది. కాబట్టి ఇది క్యాన్సర్ నుంచి మిమ్మల్ని దూరంగా ఉంచుతుంది.
పీరియడ్స్ నొప్పిని తగ్గిస్తుంది
పీరియడ్స్ సమయంలో మహిళలు పొత్తికడుపు నొప్పి, వెన్నునొప్పి వంటి సమస్యలు ఉంటాయి. ఈ పరిస్థితిలో స్త్రీలు ఒక గ్లాసు వేడి పాలలో ఒక టీస్పూన్ నల్ల పసుపు పొడిని కలిపి తీసుకోవాలి. వెంటనే నొప్పులు తగ్గిపోతాయి.