Black Raisins: నల్ల ఎండుద్రాక్ష పోషకాల నిధి.. ప్రయోజనాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు..!

Black Raisins: సాధారణంగా ఎండు ద్రాక్షని ఇళ్లలో ఎక్కువగా ఉపయోగిస్తారు.

Update: 2022-11-07 12:38 GMT

Black Raisins: నల్ల ఎండుద్రాక్ష పోషకాల నిధి.. ప్రయోజనాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు..!

Black Raisins: సాధారణంగా ఎండు ద్రాక్షని ఇళ్లలో ఎక్కువగా ఉపయోగిస్తారు. స్వీట్లు, ఇతర వంటకాలలో వేయడం వల్ల వాటి రుచి పెరుగుతుంది. నానబెట్టిన ఎండు ద్రాక్షను ప్రతిరోజూ ఉదయం తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థ బాగుంటుంది. పైల్స్ నుంచి ఉపశమనం పొందుతారు. ఎండు ద్రాక్షను రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల శరీరంలో రక్తం పెరిగి ఎముకలకు బలం చేకూరుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. చాలా మంది దీనిని డ్రై ఫ్రూట్ రూపంలో తీసుకుంటారు. ఇందులో ఉండే పోషకాలు అనేక వ్యాధుల నుంచి ఉపశమనం కలిగిస్తాయి.

1. ఒక వ్యక్తి ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో 7 నుంచి 8 ఎండుద్రాక్షలను తింటే అతని జీర్ణవ్యవస్థ చక్కగా ఉంటుంది. మలబద్ధకం సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది. ఒక వ్యక్తి ఎక్కువ కాలం మలబద్ధకంతో ఉంటే అతడికి పైల్స్ వచ్చే ప్రమాదం ఉంటుంది. నల్ల ద్రాక్షలో ఉండే ఫైబర్ మీ పొట్టకు మేలు చేస్తుంది.

2. ఈ రోజుల్లో చెడ్డ ఆహారపు అలవాట్ల వల్ల శరీరంలో ఐరన్ లోపం కనిపిస్తోంది. నలుపు ఎండుద్రాక్ష తినడం వల్ల శరీరం రక్తాన్ని వేగవంతం చేస్తుంది. దీంతో పాటు ఎముకలకు మేలు చేస్తుంది. ఆస్టియోపోరోసిస్‌తో బాధపడేవారు కూడా దీనిని తీసుకోవచ్చు. ఎముకలు బలంగా మారుతాయి.

3. చలికాలం వచ్చేసింది. ప్రజలలో రోగనిరోధక శక్తి బలహీనపడటం ప్రారంభమవుతుంది. దీంతో అంటు వ్యాధులకి గురవుతారు. నలుపు ఎండుద్రాక్ష తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. దీని ఉపయోగం అధిక BP ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఇది శరీరంలోని కొలెస్ట్రాల్ స్థాయిని కంట్రోల్‌లో ఉంచుతుంది.

Tags:    

Similar News