Health Tips: గడ్డిపై చెప్పులు లేకుండా నడిస్తే అద్భుత ప్రయోజనాలు..!

Health Tips: పెద్దలు తరచుగా గడ్డిపై చెప్పులు లేకుండా నడవమని సూచిస్తారు.

Update: 2022-10-27 06:21 GMT

Health Tips:గడ్డిపై చెప్పులు లేకుండా నడిస్తే అద్భుత ప్రయోజనాలు..!

Health Tips: పెద్దలు తరచుగా గడ్డిపై చెప్పులు లేకుండా నడవమని సూచిస్తారు. కానీ అలా ఎందుకు చెబుతారో ఎప్పుడైనా ఆలోచించారా.. నేటి కాలంలో చెప్పులు లేకుండా ఎవ్వరూ బాత్రూంకి కూడా వెళ్లడం లేదు. చెప్పులు లేకుండా నడిచే ట్రెండ్ దాదాపుగా ముగిసింది. చాలా మంది ఆరోగ్య నిపుణులు ప్రతిరోజూ ఉదయాన్నే నిద్రలేచి కనీసం 20 నిమిషాల పాటు తడి గడ్డి మీద చెప్పులు లేకుండా నడవాలని చెబుతారు. దీని వల్ల కలిగే ప్రయోజనాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు.

1. కళ్లకు మంచి ప్రయోజనం

ఉదయాన్నే నిద్రలేచి పచ్చటి గడ్డిపై చెప్పులు లేకుండా నడిస్తే అరికాళ్లపై ఒత్తిడి పడుతుంది. నిజానికి శరీరంలోని అనేక భాగాల పీడనం అరికాళ్లలో ఉంటుంది. ఇందులో కళ్లు కూడా ఉంటాయి. సరైన పాయింట్‌పై ఒత్తిడి పడితే కంటి చూపు ఖచ్చితంగా మెరుగుపడుతుంది.

2. అలెర్జీ చికిత్స

ఉదయాన్నే మంచుతో కూడిన గడ్డిపై నడవడం ఆరోగ్యానికి చాలా మంచిది. ఎందుకంటే ఇది మనకు గ్రీన్ థెరపీని ఇస్తుంది. పాదాల కింద ఉండే మృదుకణాలకు సంబంధించిన నరాలను ఉత్తేజితం చేసి మెదడుకు సిగ్నల్‌ను పంపి అలర్జీ వంటి సమస్యలను దూరం చేస్తుంది.

3. పాదాలకు రిలాక్సేషన్

మనం తడి గడ్డి మీద కాసేపు నడిచినప్పుడు అది పాదాలకు చక్కటి మసాజ్ అందిస్తుంది. పాదాల కండరాలు చాలా ఉపశమనాన్ని పొందుతాయి. దీనివల్ల తేలికపాటి నొప్పి పోతుంది.

4. టెన్షన్ నుంచి ఉపశమనం

ఉదయాన్నే గడ్డి మీద చెప్పులు లేకుండా నడవడం మానసిక ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీంతో మైండ్ రిలాక్స్ అవడంతో పాటు టెన్షన్ నుంచి ఉపశమనం లభిస్తుంది.

Tags:    

Similar News