Mutton Buying Tips: ఆదివారం మటన్ మస్తుగా తింటరా.. కొనేముందు మంచిదా చెడ్డదా గుర్తించండి..!
Mutton Buying Tips: ఆదివారం వచ్చిందంటే చాలు నాన్‌వెజ్ ప్రియులకు పండుగే. ఆ రోజు ముక్కలేనిదే ముద్ద దిగదు. మటన్, చికెన్, ఫిష్ అంటూ ఎవరికి ఇష్టమైనది వారు వండుకొని తింటారు.
Mutton Buying Tips: ఆదివారం వచ్చిందంటే చాలు నాన్‌వెజ్ ప్రియులకు పండుగే. ఆ రోజు ముక్కలేనిదే ముద్ద దిగదు. మటన్, చికెన్, ఫిష్ అంటూ ఎవరికి ఇష్టమైనది వారు వండుకొని తింటారు. అయితే మటన్ ప్రియులు చాలాసార్లు మోసపోతున్నారు. మార్కెట్‌లో కొనే మటన్ తాజాదా కాదా అనే విషయాన్ని తెలుసుకోలేకపోతున్నారు. దీంతో రెండు మూడు రోజుల కిందటి మటన్ తీసుకొని వెళుతున్నారు. దీనివల్ల అనారోగ్యానికి గురయ్యే అవకాశాలు ఉంటాయి.
మటన్, చికెన్ కొనేటప్పుడు చాలామంది అది తాజాదా కాదా అని అనుమానంతో కొనడానికి వెనుకముందు ఆలోచిస్తుంటారు. ఈ విషయంలో మటన్ కంటే చికెన్‌ను తొందరగా గుర్తించవచ్చు. చికెన్ సెంటర్‌కి వెళితే మనకు ఫ్రెష్ చికెన్ దొరుకుతుంది. లేదంటే అప్పటికే కట్ చేసి ఉంటే అది ఆరిపోయి ఉంటే అది తాజాది కాదని సులువుగా గుర్తిస్తాం. వెంటనే ఫ్రెష్ చికెన్ కావాలని డిమాండ్ చేస్తాం. కానీ మటన్ విషయంలో ఇలా గుర్తించడం కష్టమే. అయినప్పటికీ కొన్ని చిట్కాలు పాటించి సులువుగా తెలుసుకోవచ్చు.
మటన్ తీసుకునేటప్పుడు దాని నుంచి ఎక్కువగా రక్తం లేదా నీరు కారుతున్నట్లు కనిపిస్తే దాన్ని తీసుకోకపోవడమే ఉత్తమం. బాగా ఎరుపు రంగులో ఉంటే అది ముదిరిపోయిన మటన్ అని అర్థం చేసుకోవాలి. అందులో కొవ్వు ఎక్కువగా ఉంటుంది. గులాబీ, ఎరుపు మధ్య రంగులో ఉండే మటన్ అయితేనే ఆరోగ్యానికి మంచిది. చాలామంది బోన్‌లెస్ మటన్ తినేందుకు ఇష్టపడుతుం టారు. నిజానికి బోన్‌లెస్ కన్నా కూడా బోన్ మటన్ రుచిగా ఉంటుంది. బోన్స్ ఉన్న మటన్‌లో పోషకాలు అధికంగా ఉంటాయి. పైగా బొక్కలు ఉన్న మటనే త్వరగా ఉడుకుతుంది.