Young Skin In Age Of 40: 40 ఏళ్లలో కూడా అందంగా కనిపించాలా..ఈ ఆహారాలకు దూరంగా ఉంటే బెస్ట్‌..!

Young Skin In Age Of 40: వయసుపైబడిన కొద్దీ చర్మం డల్‌గా మారుతుంది. ముఖంపై ముడతలు మొదలవుతాయి.

Update: 2024-04-18 16:00 GMT

Young Skin In Age Of 40: 40 ఏళ్లలో కూడా అందంగా కనిపించాలా..ఈ ఆహారాలకు దూరంగా ఉంటే బెస్ట్‌..!

Young Skin In Age Of 40: వయసుపైబడిన కొద్దీ చర్మం డల్‌గా మారుతుంది. ముఖంపై ముడత లు మొదలవుతాయి. ఇది ప్రతి ఒక్కరికి సహజసిద్దంగా జరుగుతుంది. కానీ కొంతమంది వయసు కు ముందే ముసలివారు అవుతారు. దీనికి జీవన విధానం, చెడు అలవాట్లు కారణమవుతాయి. కొన్ని మంచి అలవాట్లు పాటించడం వల్ల వృద్ధాప్యంలో కూడా యవ్వనంగా ఉంటారు. అందరి కంటే మెరుగ్గా కనిపిస్తా రు. ముఖంపై డల్‌నెస్, ముడతలు తగ్గిపోతాయి. ఇందుకోసం మంచి డైట్‌ పాటించడం అవస రం. వాటి గురించి ఈ రోజు తెలుసుకుందాం.

మీరు చర్మాన్ని ఆరోగ్యంగా, యవ్వనంగా ఉంచుకోవాలంటే ఆహారం నుంచి చక్కెర పదార్థాలను తగ్గించాలి. ఎందుకంటే ఇది గ్లైకేషన్ ప్రక్రియను వేగవంతం చేస్తుంది. చర్మం వయస్సు వేగంగా పెంచేలా చేస్తుంది. ఆరోగ్యకరమైన చర్మం కోసం డైట్‌ నుంచి పేస్ట్రీలు, బిస్కెట్లు, పాస్తా వంటి శుద్ధి చేసిన కార్బోహైడ్రేట్లను తొలగించాలి. ధూమపానం, మద్యానికి దూరంగా ఉండాలి. ఇవి చర్మాన్ని పాడుచేయడమే కాకుండా గుండె, మెదడు, ఊపిరితిత్తులపై చెడు ప్రభావాన్ని చూపుతుంది. మూత్రపిండాలు వంటి తీవ్రమైన వ్యాధుల బారిన పడుతారు.

ఆరోగ్యకరమైన చర్మం కోసం ఫాస్ట్ ఫుడ్స్‌కు దూరంగా ఉండటం ముఖ్యం. ఎందుకంటే వీటిలో ఎక్కువగా పిండి, అనారోగ్యకరమైన సాస్‌లను ఉపయోగిస్తారు. వీటలో అధిక మొత్తంలో ఉప్పు ఉంటుంది. అలాగే ఒత్తిడి వల్ల చిన్న వయసులో వృద్ధాప్యం వస్తుంది. నిద్ర సరిగ్గా లేకపోవడం వల్ల చర్మంపై చెడు ప్రభావం పడుతుంది. రాత్రి పడుకునే ముందు ఎల్లప్పుడూ మేకప్ తొలగించి, ముఖాన్ని క్లీన్‌ చేసుకొని పడుకోవాలి. అప్పుడే ముఖంపై ఉండే దుమ్ము తొలగిపోతుంది.

Tags:    

Similar News