Health Tips: యూరిక్ యాసిడ్ పెరిగితే కీళ్లనొప్పుల సమస్య.. ఈ కూరగాయ రసం తాగితే ఉపశమనం..!
Health Tips: ఈ రోజుల్లో యూరిక్ యాసిడ్ అనేది అతిపెద్ద సమస్యగా మారింది. దీనివల్ల చాలామంది బాధపడుతున్నారు.
Health Tips: ఈ రోజుల్లో యూరిక్ యాసిడ్ అనేది అతిపెద్ద సమస్యగా మారింది. దీనివల్ల చాలామంది బాధపడుతున్నారు. చెడు ఆహారపు అలవాట్లు, మద్యపానం, ధూమపానం చేయడం వల్ల శరీరంలో యూరిక్ యాసిడ్ స్థాయి పెరుగుతుంది. ఇది కీళ్ల నొప్పులు, నడకలో సమస్యలు, పాదాలలో వాపు వంటి అనేక సమస్యలకు దారితీస్తుంది. అయితే ఆహారంలో కాస్త మార్పు చేస్తే ఈ సమస్య నుంచి బయటపడవచ్చు. రోజువారీ ఆహారంలో సొరకాయ రసాన్ని చేర్చుకున్నట్లయితే మంచి ఫలితాలు ఉంటాయి. కొన్ని రోజుల్లో యూరిక్‌యాసిడ్ స్థాయిలు తగ్గడం గమనించవచ్చు.
సొరకాయ రసం
సొరకాయలో విటమిన్ బి, విటమిన్ సి, ఐరన్ వంటి అనేక పోషకాలు ఉంటాయి. దీని రసం తీసి తాగితే యూరిక్ యాసిడ్ నియంత్రణలో ఉంటుంది. ఇందుకోసం తాజా సొరకాయ పొట్టు తీసి, చిన్న ముక్కలుగా కట్ చేసి గ్రైండర్లో జ్యూస్ చేసుకోవాలి. ఇందులో కొద్దిగా నల్ల ఉప్పు కలిపి రోజూ ఉదయం పూట తాగాలి. దీనివల్ల కీళ్ల నొప్పులు, ఎముకల వాపు నుంచి ఉపశమనం లభిస్తుంది.
1. డయాబెటిస్‌లో ఉపయోగపడుతుంది
మధుమేహ వ్యాధిగ్రస్తులు సొరకాయ రసాన్ని క్రమం తప్పకుండా తీసుకోవాలి. ఎందుకంటే ఇది రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడంలో సహాయపడుతుంది.
2. కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది
శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పరిమాణం పెరిగినప్పుడు అధిక రక్తపోటు, గుండెపోటు, కరోనరీ ఆర్టరీ వ్యాధి, ట్రిపుల్ నాళాల వ్యాధి వచ్చే ప్రమాదం పెరుగుతుంది. దీనిని నివారించడానికి క్రమం తప్పకుండా సొరకాయ రసం తాగాలి.
3. బరువు తగ్గుతారు
బరువు పెరగడం అనేది ప్రస్తుత కాలంలో పెద్ద సమస్యగా మారింది. ఈ పరిస్థితిలో సొరకాయ రసం నడుము, పొట్ట చుట్టు ఉన్న కొవ్వును తగ్గించడంలో సహాయపడుతుంది. ఎందుకంటే ఈ కూరగాయలలో లభించే కేలరీల పరిమాణం చాలా తక్కువగా ఉంటుంది.