ఉదయం నిద్ర లేవగానే కళ్లు ఉబ్బి ఉన్నాయా..! అది ఈ వ్యాధి లక్షణం కావొచ్చు..

Eyes Swollen: ఒక్కోసారి మనం నిద్రలేవగానే కళ్లు వాచిపోయి ఉంటాయి. అంతేకాకుండా కళ్ల కింద చర్మం వృత్తాకారంగా తయారవుతుంది.

Update: 2021-12-01 03:03 GMT

ఉదయం నిద్ర లేవగానే కళ్లు ఉబ్బి ఉన్నాయా..! అది ఈ వ్యాధి లక్షణం కావొచ్చు.. (ఫైల్ ఇమేజ్)

Eyes Swollen: ఒక్కోసారి మనం నిద్రలేవగానే కళ్లు వాచిపోయి ఉంటాయి. అంతేకాకుండా కళ్ల కింద చర్మం వృత్తాకారంగా తయారవుతుంది. అయితే సాధారణంగా నిద్రలేకపోతే ఇలా జరుగవచ్చు. ప్రతిరోజు ఇలాగే ఉంటే మాత్రం ఇది వ్యాధి అని గుర్తించండి. వెంటనే డాక్టర్‌ని సంప్రదిస్తే మంచిది. కొన్ని వ్యాధుల కారణంగా ఇలా కళ్లకింద ముడతలు ఏర్పడుతాయి. అవేంటో తెలుసుకుందాం.

కొల్లాజెన్ లోపం

కళ్ల కింద నల్లటి వలయాలు, వాపులకు కొల్లాజెన్ లోపమే ప్రధాన కారణమని అందాల నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇది నిజమే కొల్లాజెన్ మధుమేహం, మూత్రపిండాలు, కాలేయంతో ప్రత్యక్ష సంబంధం కలిగి ఉంటుంది. వీటికి వ్యాధులు సంభవిస్తే కొల్లాజాన్ దానికదే తగ్గడం ప్రారంభమవుతుంది. అందువల్ల కళ్ల కింద వాపులు ఏర్పడుతాయి.

మధుమేహం

కళ్ల కింద వాపు ఉందంటే రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతున్నాయని అర్థం. రక్తంలో చక్కెర పరిమాణం పెరగడం ప్రారంభించినప్పుడు కళ్ల కింద వాపు కనిపిస్తుంది. ముఖ్యంగా ఉదయం మేల్కొన్నప్పుడు మీకు అలాంటి సంకేతాలు కనిపిస్తే వెంటనే మీ రక్తంలో చక్కెర స్థాయిని తనిఖీ చేసుకోండి.

మూత్రపిండాల సమస్యలు

కిడ్నీ సమస్యలు ప్రధానంగా రెండు కారణాల వల్ల వస్తాయి. రక్తంలో చక్కెర స్థాయి పెరగడం వల్ల లేదా కిడ్నీలో రాళ్ల కారణంగా. రక్తంలో చక్కెర పరిమాణం పెరిగినప్పుడు శరీరం నుంచి అదనపు చక్కెరను తొలగించడానికి మూత్రపిండాలు చాలా కష్టపడతాయి. అటువంటి పరిస్థితిలో కిడ్నీ అలసిపోతుంది. మూత్రపిండాలు దాని సామర్థ్యం కంటే ఎక్కువగా పనిచేస్తుంటే దాని ప్రభావం కళ్ల కింద వాపు రూపంలో కనిపిస్తాయి.

కాలేయం

కాలేయ సమస్యలుంటే కళ్ల కింద వాపులు వస్తాయి. ఫ్యాటీ లివర్ వ్యాధికి సంకేతంగా చెప్పవచ్చు. శరీరంలో అధిక చక్కెర కారణంగా కాలేయం చుట్టూ కొవ్వు పేరుకుపోతుంది. దీని వల్ల కళ్ల కింద వాపులు వస్తాయి.

Tags:    

Similar News