BP Medicines: బీపీ మందులు వాడుతున్నారా.. పొరపాటున కూడా వీటి జోలికి పోవద్దు..!
BP Medicines: ఈ రోజుల్లో అధిక రక్తపోటు, చెడు కొలెస్ట్రాల్ ప్రజలను పట్టి పీడిస్తున్నాయి.
BP Medicines: ఈ రోజుల్లో అధిక రక్తపోటు, చెడు కొలెస్ట్రాల్ ప్రజలను పట్టి పీడిస్తున్నాయి. ఒకప్పుడు వృద్ధులకు, పెద్ద వయసువారికి మాత్రమే బీపీ సమస్య వచ్చేది. కానీ ఇప్పుడు చిన్నవయసులోనే వస్తున్నాయి. శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయి పెరిగితే హైబీపీయే కాకుండా గుండెపోటు కూడా సంభవిస్తుంది. మందుల వల్ల మనకు ఉపశమనం లభిస్తుందనేది నిజమే కానీ ఆహారం సరిగా లేకుంటే అవి పనిచేసే విధానం కూడా మారిపోతుంది. వ్యాధులు రాకుండా ఉండాలంటే మంచి డైట్ పాటించాలి. ఎవరైనా బీపీ వంటి తీవ్రమైన వ్యాధులకు మందులు వాడుతుంటే ఎలాంటి వాటికి దూరంగా ఉండాలో ఈరోజు తెలుసుకుందాం.
కొలెస్ట్రాల్‌ను తగ్గించడానికి చాలామంది మందులు వేసుకుంటున్నారు. ఈ క్రమంలో కొన్ని పదార్థాలకి దూరంగా ఉండాలి. లేదంటే తీవ్ర నష్టాన్ని ఎదుర్కోవలసి ఉంటుంది. రెడ్ మీట్, పాల ఉత్పత్తులను తినడం మానుకోవాలి. బీపీకి మందులు వాడుతుంటే ఉప్పు తీసుకోవడం తగ్గించండి. అధిక ఉప్పు కారణంగా రక్తపోటు పెరిగే ప్రమాదం ఉంది. ఈ సందర్భంలో మందుల ప్రభావం కూడా పనిచేయదు. బిపి ఉన్నవారు ప్రాసెస్ చేసిన ఆహారం, ఎక్కువ ఉప్పు పదార్థాలు తినకూడదు. అలాగే ఆల్కహాల్ తీసుకోవడం రక్తపోటు స్థాయిని మరింత పెంచుతుందని గుర్తుంచుకోండి.
ఇది కాకుండా ఎక్కువ సోయా పదార్థాలు బీపీ ఉన్నవారికి హానికరమని చెప్పవచ్చు. ముఖ్యంగా హైపోథైరాయిడిజం ఉన్నవారు సోయా ఉత్పత్తులకు దూరంగా ఉండాలి. సోయా పాలు, సోయా బీన్ వెజిటేబుల్ లేదా ఇతర సోయా ఉత్పత్తులను తక్కువగా తీసుకోవాలి. నిపుణుల అభిప్రాయం ప్రకారం వీటికి బదులుగా తాజా కూరగాయలు, పండ్లు, ప్రోటీన్ అధికంగా ఉండే వాటిని తినడం అలవాటు చేసుకోవాలి.