Toothache Tips: పంటి నొప్పితో ఇబ్బంది పడుతున్నారా.. తక్షణ ఉపశమనానికి ఇలా చేయండి..!

Toothache Tips: కొన్నిసార్లు దంతాలు పుచ్చిపోవడం, బ్యాక్టీరియా కారణంగా చిగుళ్లలో వాపులు సంభవిస్తాయి.

Update: 2023-03-26 05:55 GMT

Toothache Tips: పంటి నొప్పితో ఇబ్బంది పడుతున్నారా.. తక్షణ ఉపశమనానికి ఇలా చేయండి..!

Toothache Tips: కొన్నిసార్లు దంతాలు పుచ్చిపోవడం, బ్యాక్టీరియా కారణంగా చిగుళ్లలో వాపులు సంభవిస్తాయి. విపరీతమైన నొప్పిగా ఉంటుంది. ఎందుకంటే దంతాల లోపల ఉండే నరాలు, కణజాలం రక్తనాళాలతో నిండిన మృదువైన పదార్థం. ఇవి అత్యంత సున్నితమైనవి. బ్యాక్టీరియా దాడి చేసినప్పుడు అవి తీవ్రమైన నొప్పిని కలిగిస్తాయి. ఇలాంటి సమయంలో దంతవైద్యుడిని సంప్రదించాలి. అయితే తక్షణ ఉపశమనం కోసం కొన్ని చిట్కాలని పాటించవచ్చు. వాటి గురించి తెలుసుకుందాం.

1. లవంగం నూనె

లవంగం యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉంటుంది. ఒక కాటన్ బాల్‌లో ఒకటి లేదా రెండు చుక్కల లవంగం నూనె తీసుకొని నొప్పి ఉన్న దగ్గర అప్లై చేయాలి. దీనివల్ల నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది.

2. వెల్లుల్లి వాడకం

నోటి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ప్రతిరోజు ఒక వెల్లుల్లి ముక్కను పరగడుపున తీసుకోవాలి. దీనివల్ల పంటి నొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది. ఎందుకంటే ఇది బ్యాక్టీరియాను నాశనం చేస్తుంది.

3. జామ ఆకులు

జామ ఆకులు యాంటీమైక్రోబయల్ గుణాలతో నిండి ఉంటాయి. ఇవి క్యావిటీలను నివారించడంలో మేలు చేస్తాయి. జామ ఆకులను ఉడకబెట్టి మౌత్ వాష్‌గా ఉపయోగించవచ్చు.

4. నిమ్మరసం

నిమ్మకాయలో సిట్రిక్ యాసిడ్ పుష్కలంగా ఉంటుంది. ఇది నొప్పిని తగ్గించడంలో సహాయపడుతుంది. ఆహారం తిన్న తర్వాత కొంత సమయానికి నిమ్మరసాన్ని నొప్పి ఉన్న దగ్గర అప్లై చేయాలి. ఇది దంత క్షయాన్ని నివారించి దంతాలని కాపాడుతుంది.

Tags:    

Similar News