Low BP Patients: లో బీపీతో బాధపడుతున్నారా.. ఈ ఆరోగ్య చిట్కాలు పాటిస్తే హెల్దీగా ఉంటారు..!
Low BP Patients: నేటి జీవనశైలి, ఆహారపు అలవాట్ల వల్ల చాలామంది బీపీతో బాధపడుతున్నారు.
Low BP Patients: నేటి జీవనశైలి, ఆహారపు అలవాట్ల వల్ల చాలామంది బీపీతో బాధపడుతున్నారు. ఇందులో కొందరు హైబీపీతో మరికొందరు లోబీపీతో బాధపడుతున్నారు. ఈ రెండూ కూడా చాలా ప్రమాదకరం. ఒక్కోసారి ప్రాణాలు పోయే పరిస్థితిని తీసుకువస్తాయి. హైబీపీ పేషెంట్లతో పోలిస్తే లోబీపీ పేషెంట్లు చాలా వీక్గా ఉంటారు. తరచుగా కళ్లు తిరిగిపడిపోతుంటారు. ఇలాంటి వారు ఏదైనా భారీ పనులు, వ్యాయామం చేయడం కష్టం. అందుకే లో బీపీ పేషెంట్లు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఈ రోజు తెలుసుకుందాం.
మీరు లో బీపీతో బాధపడుతున్నట్లయితే ప్రతిరోజు వ్యాయామం చేయాలి కానీ తక్కువ తీవ్రత గల వ్యాయామం చేయాలి. అంటే బరువులు ఎత్తడం, గంటల తరబడి పరుగెత్తడం లాంటి సాహసాలు చేయవద్దు. నెమ్మదిగా నడవడం, ఎక్సర్సైజ్ చేస్తే సరిపోతుంది. లో బీపీ పేషెంట్లు అధిక ఉష్ణోగ్రతను తట్టుకోవలేదరు. వేసవి కాలం వీరికి బాధాకరంగా ఉంటుంది. ఈ పరిస్థితిలో రక్తపోటును నియంత్రించడం కష్టంగా ఉంటుంది. అందుకే సాధ్యమైనంతవరకు సాధారణ ఉష్ణోగ్రతలో ఉండడానికి ప్రయత్నించాలి.
లో బీపీ పేషెంట్లు తరచుగా నీరు తాగుతూ ఉండాలి. ఎండలోకి వెళ్లే ముందు కచ్చితంగా తగినంత నీరు తాగాలి. ఇలా చేయడం వల్ల ముందుగా వచ్చే ప్రమాదాలను నివారించవచ్చు. ఎందుకంటే నీరు మీరు పనిచేస్తున్నప్పుడు రక్త పరిమాణాన్ని మెయింటెన్ చేస్తుంది. మీకు మూర్ఛ, అలసట, తల తిరగడం లాంటివి అనిపిస్తే వెంటనే అన్నీ వదిలేసి విశ్రాంతి తీసుకుని వైద్యులను సంప్రదించాలి. ఈ రోజుల్లో ఒత్తిడి లేదా టెన్షన్ సర్వసాధారణం కానీ లో బీపీ పేషెంట్లకు ఇది ఉండకూడదు. అందువల్ల మీ మనస్సుపై అనవసరమైన ఒత్తిడిని కలిగించవద్దు. ఎల్లప్పుడూ సంతోషంగా ఉండటానికి ప్రయత్నించాలి. సాధ్యమైతే యోగా, ధ్యానం చేయడం అలవాటు చేసుకోవాలి.