అర్దరాత్రి వరకు మెలకువగా ఉంటున్నారా.. ఈ చిట్కాలు పాటిస్తే వెంటనే నిద్రలోకి జారుకుంటారు..!
Health Tips: రోజువారీ పనులని చక్కగా చేయడానికి, వ్యాధులని దూరంగా ఉంచడానికి ప్రతిరోజు తగినంత నిద్ర అవసరం.
Health Tips: రోజువారీ పనులని చక్కగా చేయడానికి, వ్యాధులని దూరంగా ఉంచడానికి ప్రతిరోజు తగినంత నిద్ర అవసరం. రాత్రి 7-8 గంటల నిద్ర రోజంతా అలసటను దూరం చేస్తుంది. అయితే చాలాసార్లు కొంతమందికి అర్థరాత్రి వరకు నిద్ర రాదు. దీనివల్ల అనేక సమస్యలు తలెత్తుతాయి. నిద్ర లేకపోవడం వల్ల మనసుకు, శరీరానికి విశ్రాంతి లభించక మరుసటి రోజు అలసట, నీరసంగా కనిపిస్తారు.
నేటి జీవనశైలిలో నిద్రకు సంబంధించిన సమస్యలు ప్రజల జీవితంలో ముఖ్యమైన భాగంగా మారుతున్నాయి. దీని కారణంగా ప్రజల ఆరోగ్యం దెబ్బతింటుంది. రాత్రిపూట ఆలస్యంగా పడుకునే సమస్య ఉన్నవారు కొన్ని చిట్కాలని పాటించవచ్చు. ఆయుర్వేద మందులు, సుగంధ ద్రవ్యాలు, ఇంట్లో ఉపయోగించే కొన్ని పదార్థాలు తొందరగా నిద్రవచ్చేలా చేస్తాయి. వాటి గురించి తెలుసుకుందాం.
మసాజ్
మీకు రాత్రి నిద్ర సరిగా రాకపోతే పడుకునే ముందు పాదాలకు ఆవాల నూనెతో మసాజ్ చేయాలి. అరికాళ్లకు మసాజ్ చేయడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది. మైండ్ రిలాక్స్ అవుతుంది ఇది మంచి నిద్రకు దారి తీస్తుంది.
అశ్వగంధ
అశ్వగంధ మీకు బాగా నిద్రపోవడానికి సహాయపడుతుంది. రాత్రి పడుకునే ముందు గోరువెచ్చని పాలలో అశ్వగంధ పొడిని కలిపి తాగితే ఒత్తిడి తగ్గుతుంది. దీంతో మీరు త్వరగా మంచి నిద్రను పొందవచ్చు.
పాలు, తేనె
రాత్రి పడుకునే ముందు గోరువెచ్చని పాలు తాగడం వల్ల మనసుకు విశ్రాంతి లభిస్తుంది. దీంతో మంచి నిద్ర కూడా వస్తుంది. విపరీతమైన అలసట వల్ల నిద్రపట్టని వారు గోరువెచ్చని పాలలో అర టీస్పూన్ తేనె కలిపి తాగాలి. తేనెతో పాలను తాగడం వల్ల నిద్రలేమి సమస్యకు పరిష్కారం లభిస్తుంది.
చామంతి టీ
చామంతి టీ తీసుకోవడం వల్ల మనస్సు రిలాక్స్ అవుతుంది. ఇందులో అపిజెనిన్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది నిద్రకు సంబంధించిన సమస్యలను తగ్గిస్తుంది.